పవన్‌తో కలవడంపై రేణు దేశాయ్ క్లారిటీ.. అలాంటి వాళ్లను నమ్మొద్దంటూ షాకింగ్ రియాక్షన్.!
తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులతో పాటు సామాన్యులకు పరిచయం చేయనవసరం లేని వాళ్లలో ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ఒకరు. దీనికి కారణం ఆమె టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్‌ను ప్రేమ పెళ్లి చేసుకోవడమే. ఆ తర్వాత చాలా కాలం పాటు వార్తల్లోకి ఎక్కని ఆమె.. పవర్ స్టార్‌తో విడాకులు తీసుకున్న తర్వాత తరచూ హాట్ టాపిక్ అవుతున్నారు. ఇక, ఈ మధ్య ఆమె పవన్ కల్యాణ్‌తో మరోసారి కలవబోతున్నారని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. తాజాగా దీనిపై రేణు స్పందించారు. అలాంటి వాళ్లను నమ్మొద్దంటూ షాకింగ్ రిప్లై ఇచ్చారు. ఆ వివరాలు మీకోసం.!

పవన్ - రేణును పూరీ జగన్నాథే కలిపాడు
రేణు దేశాయ్.. పవన్ కల్యాణ్ నటించిన ‘బద్రీ' సినిమాతోనే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. ఈ మూవీని డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే పవన్ - రేణు మధ్య ప్రేమ పుట్టింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం.. ఇద్దరు పిల్లలకు జన్మనివ్వడం చకచకా జరిగాయి. ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం విడాలకు తీసుకున్నారు.

రేణు గురించి ఈ విషయం మందికి తెలియదు
రేణు దేశాయ్ తెలుగులో రెండు సినిమాల్లో మాత్రమే నటించింది. ఆ రెండూ పవన్ కల్యాణ్ నటించిన ‘బద్రీ', ‘జానీ' మూవీలే. వీటితో పాటు తమిళంలో ‘జేమ్స్ పాండూ' అనే సినిమాలోనూ కనిపించింది. ఇక, ఇటీవల ‘ఇష్క్ వాలా లవ్' అనే మూవీతో నిర్మాత కమ్ దర్శకురాలిగా మారింది. అంతేకాదు, కొన్ని సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గానూ వర్క్ చేసింది.

అక్కడ హల్‌చల్ చేస్తున్న రేణు దేశాయ్
కొన్నేళ్లుగా స్వాతంత్ర్య జీవితం గడుపుతున్న రేణు దేశాయ్.. పుణేలో నివాసం ఉంటున్నారు. పవన్‌తో విడిపోయినప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్ అయ్యారు. ఈ క్రమంలోనే తరచూ ఏదో ఒక పోస్ట్ పెట్టడం.. తన పిల్లల ఫొటోలు షేర్ చేయడం.. వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వంటివి చేస్తున్నారు.

ఆ హీరో మూవీతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ
మరాఠీలో కొన్ని సినిమాలను నిర్మించిన రేణు దేశాయ్.. టాలీవుడ్‌లోకి కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నారని ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - ‘దొంగాట' డైరెక్టర్ వంశీ కృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఓ మూవీలో ఆమె నటించబోతున్నారని అన్నారు. కానీ, ఈ మూవీ విషయంలో క్లారిటీ మాత్రం రాలేదు.

పవన్ కల్యాణ్‌తో మళ్లీ కలుస్తున్న రేణూ
కొద్ది రోజుల క్రితం రేణు దేశాయ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ హైలైట్ అయింది. చాలా కాలంగా ఖాళీగా ఉంటున్న ఆమె.. పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘వకీల్ సాబ్'లో కీలక పాత్ర పోషిస్తున్నారనేదే ఆ వార్త సారాంశం. అంతేకాదు, ఈ మూవీలో ఆమె పవర్ స్టార్‌కు భార్యగా కనిపించబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయిపోయింది.

పవన్‌తో కలవడంపై రేణు దేశాయ్ క్లారిటీ
తాజాగా సోషల్ మీడియాలో రేణు దేశాయ్ లైవ్‌లోకి వచ్చారు. ఈ సందర్భంగా తనకు, తన పిల్లలకు సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడారు. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ‘మీరు వకీల్ సాబ్‌లో నటిస్తున్నారట కదా' అని అడిగాడు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘నేను ప్రస్తుతం ఏ సినిమాలోనూ నటించడం లేదు. వకీల్ సాబ్‌లో చేస్తున్నానన్నది పచ్చి అబద్ధం' అని చెప్పుకొచ్చారు.

అలాంటి వాళ్లను నమ్మొద్దంటూ షాకింగ్ రియాక్షన్.!
అంతేకాదు, ఈ సందర్భంగా తెలుగు మీడియాపైనా ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘అసలు ఇలా రూమర్స్ ఎలా క్రియేట్ చేస్తారో నాకు అర్థం కాదు. మనం చూస్తున్నంత కాలం వాళ్లు గాసిప్స్ రాస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా తెలుగు మీడియాలో వచ్చే వార్తలు నమ్మొద్దు. ఈ వార్తలు చూస్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తోంది' అంటూ వివరించారు.


Click it and Unblock the Notifications











