twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అకిరా నందన్ ఎంట్రీ ఉంటుందా లేదా.. మరో క్లారిటీ ఇచ్చిన రేణూ దేశాయ్

    |

    నెపోటిజమ్ డోస్ పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సినీ వారసుల మదిలో కాస్త కలవరం మొదలైంది. వారసుడు అనే మాట వినబడితేనే సోషల్ మీడియాలో ఒక రకమైన కామెంట్స్ వస్తున్నాయి. ఫైనల్ గా ఆడియెన్స్ ఆదరిస్తేనే ఎవరైనా సరే సక్సెస్ అవుతారు అనే నిజాన్ని చాలా తక్కువ మంది ఏకీభవిస్తున్నారు. ఇక నెక్స్ట్ జనరేషన్స్ నుంచి రానున్న యువ హీరోలపై కూడా నెపొటిజమ్ ఎఫెక్ట్ పడే ఛాన్స్ లేకపోలేదు.

    ఇటీవల ఆ విషయంపై రేణూ దేశాయ్ వివరణ ఇచ్చారు. నెపోటిజమ్ అనేది ఎక్కడైనా ఉంటుందని అయితే సినిమా ఇండస్ట్రీలో అది కేవలం ఒకటి లేదా రెండు సినిమాలకు మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు. ఇక అకిరా నందన్ ఎంట్రీపై కూడా ఆమె క్లారిటి ఇచ్చే ప్రయత్నం చేశారు. అకిరా ఎంట్రీ ఉంటుందా లేదా అనే విషయంపై తన సొంత నిర్ణయం కాదని పూర్తిగా ఆ ఆలోచనని అకిరాకే వదిలేస్తున్నానని తెలిపారు.

    Renu Desai comments on akira nandan acting entry

    ప్రస్తుతం 16ఏళ్ల వయసుకు వచ్చిన అకిరా నందన్ వాళ్ళ పెదనాన్న, నాన్న లాగా హీరో అవ్వడంలో తప్పులేదు. కానీ అతను ప్రస్తుతం ఎడ్యుకేషన్ పై దృష్టి పెట్టినట్లు చెబుతూ.. కెరీర్ పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది అకిరా నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇక మరోవైపు అకిరా నందన్ అనగానే అతని మొదటి సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఒక రేంజ్ లో ఉహించుకుంటున్నారు. అయితే అకిరాకు మాత్రం ప్రస్తుతం సినిమా హీరో అవ్వాలనే ఇష్టం లేదని రేణూ దేశాయ్ క్లారిటీ ఇవ్వడంతో అభిమాను ఆ విషయం కాస్త కన్ఫ్యూజన్ కి గురి చేస్తోంది.

    English summary
    Many people comment that nepotism in the cinema industry is completely understandable in what range. Even before the death of Sushant, the word nepotism was not so viral. But when he became suicidal, the word became a hot topic not only in Bollywood but also in other industries. Recently Renu Desai has also commented on nepotism.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X