పర్‌ఫెక్ట్ పర్సన్ : పవన్ కళ్యాణ్ ఫస్ట్‌లుక్‌పై రేణు దేశాయ్
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘గోపాల గోపాల' మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌పై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించింది. ‘పర్‌ఫెక్ట్ పోస్టర్ ఫర్ పర్ ఫెక్ట్ పర్సన్' అంటూ తన మనసులోని అభిప్రాయాన్ని వెలుబుచ్చింది. నిర్మలమైన దివ్యమైన లుక్ ఆయనకు మాత్రమే సాధ్యం అంటూ మాజీ భర్తపై పొగడ్తలు గెప్పించింది రేణు దేశాయ్.
హిందీలో విజయవంతమైన 'ఓ మై గాడ్' చిత్రాన్ని పవన్ కల్యాణ్, వెంకటేష్ మల్టీ స్టారర్‌గా తెలుగులో 'గోపాల గోపాల'గా రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మోడరన్ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. వెంకటేష్ వ్యాపారి పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సురేష్ బాబు, శరత్ మరార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీయ కీలకమైన పాత్ర పోషిస్తోంది.
ఇక రేణు దేశాయ్ గురించిన వివరాల్లోకి...భర్తతో విడిపోయిన తర్వాత పూణెకు మకాం మార్చిన రేణు దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తా చాటుకునే ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఓ మరాఠీ సినిమాను నిర్మించగా...తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ఇష్క్ వాలా లవ్' చిత్రాన్ని తెరకెంచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడదల కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











