For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆనందయ్యపై రేణు దేశాయ్ సెన్సేషనల్ కామెంట్స్: కరోనా మందుపై వివాదాలు.. అదే నిజమనుకుంటా అంటూ!

  |

  కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో తరచూ హాట్ టాపిక్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నారు సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్. సినిమా హీరోయిన్‌గా, పవన్ కల్యాణ్ భార్యగా అందరికీ పరిచయం అయిన ఆమె.. ఈ మధ్య తన వ్యవహార శైలితో హైలైట్ అవుతున్నారు. మరీ ముఖ్యంగా కరోనా సమయంలో ఆమె ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది ఆ మహమ్మారి నుంచి బయట పడేలా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా రేణు దేశాయ్ కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందుపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఆ వివరాలు మీకోసం!

  ఇష్టమైన హాలీడే స్పాట్‌లో అందాల విందు చేస్తున్న హీరోయిన్లు

  విరామం తర్వాత ఫోకస్ చేసిన రేణు

  విరామం తర్వాత ఫోకస్ చేసిన రేణు

  పూరీ జగన్నాథ్ రూపొందించిన ‘బద్రీ' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు రేణు దేశాయ్. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే వివాహం చేసుకున్నారు. అనంతరం కూడా కాస్ట్యూమ్ డిజైనర్‌గా, ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఇక, డివోర్స్ తర్వాత మళ్లీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మధ్య దర్శకురాలిగానూ మారారు. కానీ, ఆమెకు నిరాశే ఎదురైంది.

  ఆ షోలో భాగం అయిన పుణే భామ

  ఆ షోలో భాగం అయిన పుణే భామ

  తెలుగు బుల్లితెరపై వచ్చే వినోద కార్యక్రమాల్లో ‘డ్రామా జూనియర్స్' ఒకటి. నాలుగు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో ‘డ్రామా జూనియర్స్ - ద నెక్ట్స్ సూపర్ స్టార్' పేరిట ఐదో సీజన్‌ కూడా ఇటీవలే ప్రారంభమైంది. దీనికి ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, సింగర్ సునీతతో కలిసి రేణు దేశాయ్‌ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఆమె ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణ అవుతున్నారు.

   అందులో యమ బిజీ.. వాడేస్తుంది

  అందులో యమ బిజీ.. వాడేస్తుంది

  సోషల్ మీడియాలో రేణు దేశాయ్ యమ యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇందులో తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ సంబంధించిన విశేషాలను తరచూ ప్రస్తావిస్తుంటారు. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తున్నారు. దీంతో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే రేణు దేశాయ్ కొన్ని లక్షల మంది ఫాలోవర్లను సంపాదించారు.

   కరోనా సమయంలో అందరికీ అండ

  కరోనా సమయంలో అందరికీ అండ

  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం భారీగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల్లో చాలా మంది తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభాగ్యులకు అండగా ఉంటున్నారు. ముఖ్య సమాచారాన్ని పది మందికి తెలిసేలా చేస్తున్నారు. ఈ బాటలోనే నడుస్తున్నట్లు ప్రకటించారు రేణు దేశాయ్. అందుకు అనుగుణంగానే కొన్ని రోజులుగా కోవిడ్ బాధితులకు సహాయం చేస్తున్నారు.

   నెటిజన్లకు సహాయం.. వార్నింగ్‌లు

  నెటిజన్లకు సహాయం.. వార్నింగ్‌లు

  ఎవరికైనా ఏదైనా సహాయం కావాలంటే తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయమని రేణు దేశాయ్ సూచించారు. అందుకు అనుగుణంగానే ఆమెకు ఎంతో మంది అభాగ్యులు సందేశాలు పంపి సహాయం కోరుతున్నారు. వీటిపై ఆమె కూడా స్పందిస్తున్నారు. అదే సమయంలో కొందరు ఆకతాయిలు రేణు దేశాయ్‌కు పిచ్చి పిచ్చి మెసేజ్‌లు పెడుతూ చిరాకు తెప్పించగా.. వార్నింగ్ ఇచ్చారు.

  ఆనందయ్యపై సెన్సేషనల్ కామెంట్స్

  ఆనందయ్యపై సెన్సేషనల్ కామెంట్స్

  కరోనాను నయం చేసేందుకు మందు తయారు చేశామంటూ చెబుతూ.. దాన్ని పంపిణి చేయడం ప్రారంభించారు కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య. చాలా మందికి ఈ మందు ఇచ్చిన తర్వాత వివాదం చెలరేగింది. దీంతో ప్రభుత్వం సైతం రంగంలోకి దిగి దానిపై పరీక్షలు జరుపుతోంది. దీంతో మందు పంపిణీ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో ఆనందయ్య మందుపై రేణు స్పందించారు.

  Netizen కి Renu Desai పవర్ పంచ్, పోయి వాళ్ళని అడుగు అంటూ ఆగ్రహం!! || Filmibeat Telugu
   అదే అసలు నిజమనుకుంటా అంటూ

  అదే అసలు నిజమనుకుంటా అంటూ

  కరోనా మందుపై మాట్లాడుతూ.. ‘ఆయుర్వేదాన్ని నేను బాగా నమ్ముతాను. అలాగే, ఆనందయ్య ఇస్తున్న మందును కూడా నమ్మాలనే అనిపిస్తోంది. దీనికి కారణం ఆయన ఉచితంగా దీన్ని పంపిణి చేయడంతో పాటు ఎంతో మందికి కరోనా నయం అయిందని చెబుతుండడమే. నిజం కాకపోతే దీనికి ఆ రేంజ్‌లో రెస్పాన్స్ రాదు కదా' అంటూ ఊహించని కామెంట్స్ చేశారు రేణు దేశాయ్.

  English summary
  Tollywood Senior Heroine Renu Desai is Very Active in Social Media. Now She Sensational comments on Anandayya Medicine.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X