»   » జుట్టు కత్తిరించుకున్న రేణు దేశాయ్, మంచి పని కోసమే! (ఫోటోస్)

జుట్టు కత్తిరించుకున్న రేణు దేశాయ్, మంచి పని కోసమే! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటి, దర్శకురాలు, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ట్విట్టర్లో ఆసక్తికర పోస్టు చేసింది. ఇన్నాళ్లు పొడవాటి జుట్టుతో ఉన్న ఆమె ఉన్నట్టుండి తన జుట్టును కత్తిరించుకుంది. కత్తిరించిన తన జడను, తన కొత్త షార్ట్ హెయిర్ లుక్‌కు సంబంధించిన ఫోటోలు పోస్టు చేసింది.

తాను ఇలా జుట్టు కత్తిరించుకోవడానికి కారణాన్నికూడా వెల్లడించింది రేణు దేశాయ్. పేద క్యాన్సర్ పేషెంట్స్ కోసం విగ్గు తయీరీ కోసం తన జుట్టును త్యాగం చేసింది. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థ కోసం రేణు దేశాయ్ తన జట్టును డొనేట్ చేసింది. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించడంలో భాగంగానే ఇలా చేసాను అని ఆమె తెలిపారు.

జుట్టును కత్తిరించుకోవడం అనేది చాలా కష్టమైన నిర్ణయం, నాకు పొడవాటి జుట్టు అంటే ఎంతో ఇష్టం, కానీ నా అందం కంటే క్యాన్సర్ పేషెంట్స్ కోసం డొనేట్ చేయడం అనేది చాలా ముఖ్యం అనిపించిందని రేణు దేశాయ్ పేర్కొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో....

షార్ట్ హెయిర్

షార్ట్ హెయిర్


జుట్టు కత్తిరించుకున్న తర్వాత రేణు దేశాయ్ షార్ట్ హెయిర్ లుక్.

లాంగ్ హెయిర్

లాంగ్ హెయిర్


రేణు దేశాయ్ పొడవాటి జుట్టుతో ఇలా...

కత్తిరించిన అనంతరం

కత్తిరించిన అనంతరం


జుట్టు కత్తిరించిన అనంతరం రేణు దేశాయ్ జడ ఇలా....

రేణు దేశాయ్

రేణు దేశాయ్


ఒక మంచి పని కోసం రేణు దేశాయ్ జుట్టు కత్తిరించుకోవడంపై అభిమానుల నుండి హర్షం వ్యక్తమవుతోంది.

English summary
Pawan's ex-wife and Actress Renu Desai has posted an interesting update in her social networking handle. Renu cuts the hair. You may ask whats the big deal in that. Here is the reason why the actress has sacrificed her hair.Renu Cuts her hair to donate for making wigs for poor and underprivileged Cancer patients.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu