»   » రేణు దేశాయ్ గ్రేట్ డెసిషన్.. సంచలన టాపిక్‌తో సినిమా, తెలుగులోనే!

రేణు దేశాయ్ గ్రేట్ డెసిషన్.. సంచలన టాపిక్‌తో సినిమా, తెలుగులోనే!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    Renu Desai About To Direct Telugu Film Soon

    పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ త్వరలో రెండవ వివాహానికి సిద్ధం అవుతోంది. ఇటీవలే రేణు దేశాయ్ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్న రేణు దేశాయ్ సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సంపాదన కొరకు రేణు దేశాయ్ గతంలో సొంతంగా సినిమాలు నిర్మించి తెరకెక్కించారు. తాజగా ఆమె తెలుగులోనే ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి రేణు దేశాయ్ దర్శకత్వం వహిస్తారు. ఆమె ఎలాంటి కథ ఎంచుకున్నారో తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.

    గ్రేట్ డెసిషన్

    గ్రేట్ డెసిషన్

    సందేశాత్మక చిత్రాలు తెరకెకెక్కించడం ఏ దర్శకుడికైనా సవాల్ తో కూడుకున్న పని. సందేశాత్మక చిత్రాలలలో సందేశం ఉంటె సరిపోదు. ఆడియన్స్ ని మెప్పించే అంశాలు కూడా ఉండాలి. రేణు దేశాయ్ రైతుల ఆత్మహత్యల నేపథ్యంలో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. నిజంగా ఇది గొప్ప నిర్ణయమే.

    హాట్ టాపిక్

    హాట్ టాపిక్

    రైతు సమస్యలపై చాలా సినిమాలు వచ్చాయి. కానీ రైతు ఆత్మహత్యలే ప్రధాన ఇతివృత్తంగా సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో తాను కథ సిద్ధం చేసుకుంటున్నట్లు రేణు దేశాయ్ వివరించారు. దేశంలోనే రైతులు మరణాలు ఎంత హాట్ టాపిక్కో అందరికి తెలిసిందే.

     కథ సిద్ధం

    కథ సిద్ధం

    తాను డాన్స్ షో కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగు సినిమాకు దర్శకత్వం ఎప్పుడు వహిస్తారని చాలా మంది అడిగారు. ఎట్టకేలకు తెలుగు చిత్రం తెరకెక్కించాలని నిర్ణయించుకున్నా. కథ సిద్ధం చేశా. ప్రస్తుతం డైలాగ్స్ రాస్తున్నట్లు రేణు దేశాయ్ వివరించింది.

    ప్రత్యక్షంగా చూసి

    ప్రత్యక్షంగా చూసి

    తాను చిన్న తనంలో తాన్ తండ్రి వ్యవసాయం చేయడం దగ్గరినుంచి చూశానని రేణు దేశాయ్ తెలిపింది. ఈ సినిమా కోసం ఓ గ్రామానికి వెళ్లి రైతులని ప్రత్యక్షంగా పరిశీలిస్తానని తెలిపింది.

    నేనే నిర్మాత

    నేనే నిర్మాత

    ఆసక్తికరంగా ఈ చిత్రానికి నిర్మాత కూడా రేణు దేశాయ్ కావడం విశేషం. బయటవారి నిర్మాత అయితే నేను సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ చిత్రాన్ని నేనే నిర్మిస్తున్నా. రైతుల సమస్యలని చూపించడం మాత్రమే కాక పరిష్కారం కూడా ఈ చిత్రంలో చూపిస్తానని రేణు దేశాయ్ తెలిపింది.

    English summary
    Renu Desai To direct Telugu film soon. This film based on farmers issues
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more