పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్...20 లక్షలు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హుధూద్ తుఫాన్ బాధితుల కోసం రూ. 50 లక్షల విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ కూడా రూ. 20 లక్షలు విరాళం అందించి పెద్ద మనసు చాటుకున్నారు.

ఇక రేణు దేశాయ్ గురించిన వివరాల్లోకి వెళితే...
పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్', కొడుకు పేరు మీద ‘అకీరా ఫిల్మ్స్' అనే సినీ నిర్మాణ సంస్థలను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్నారు. రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం. అకీరా నందన్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు.


Click it and Unblock the Notifications











