»   » పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎంగేజ్మెంట్, ఈ ఫోటోయే సాక్ష్యం!

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎంగేజ్మెంట్, ఈ ఫోటోయే సాక్ష్యం!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Renu Desai Engagement Pics Goes Viral

  పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణూ దేశాయ్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు సంకేతాలు ఇస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తనకు మరొక తోడు దొరికిందని, ఇపుడు జీవితం చాలా సంతోషంగా ఉందంటూ ఆమె ఓ వ్యక్తి చేయిపట్టుకున్న ఫోటోను కొన్ని రోజుల క్రితం పోస్టు చేశారు. తాజాగా రేణు ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మరో ఆసక్తికర పోస్టు పెట్టారు. ఈ ఫోస్టు చేయడం ద్వారా తనకు ఎంగేజ్మెంట్ జరిగిపోయిందని ఆమె అఫీషియల్‌గా ప్రకటించారు.

  ఎంగేజ్డ్

  ఎంగేజ్మెంట్ రింగ్స్ రింగ్స్ మార్చుకున్న ఆ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతే కాదు ఈ ఫోటోకు ‘ఎంగేజ్డ్' అని క్యాప్షన్ పెట్టారు. దీని ద్వారా రేణు దేశాయ్ మరొక వ్యక్తితో జీవితం పంచుకుంటున్నారనే విషయం స్పష్టమౌతోంది.

  ఎవరా వ్యక్తి?

  తన జీవితంలోకి వచ్చిన ఆ వ్యక్తి గురించిగానీ, అతడి పేరుగానీ రేణు దేశాయ్ వెల్లడించలేదు. అయితే అతడు కూడా భార్యతో విడాకులు అయిన వ్యక్తే అని తెలుస్తోంది. ఈ ఫోటోలో ఉన్న మరో పాప అతడి కూతురుగా భావిస్తున్నారు. రేణు దేశాయ్ కూడా ఇందుకు సంబంధించి కొన్ని హింట్స్ ఇచ్చారు.

   గొడవలైపోతాయి అంటున్న పవన్ అభిమానులు

  గొడవలైపోతాయి అంటున్న పవన్ అభిమానులు

  అయితే రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకోవడం చాలా మంది అభిమానులకు ఇష్టం లేదు. ‘మీరు రెండో పెళ్లి చేసుకుంటే గొడవలు అవుతాయ్‌. నా దేవుడికి ఎలాంటి సమస్యలు రాకూడదు. కాబట్టి ఏం చేసినా ఆలోచించి చేయండి.' ఓ వ్యక్తి వ్యాఖ్యానించగా..... దీనికి రేణు దేశాయ్ స్పందిస్తూ..‘క్రేజీ' అంటూ రిప్లై ఇచ్చారు.

  వారి ప్రవర్తనపై చింతించిన రేణు దేశాయ్

  వారి ప్రవర్తనపై చింతించిన రేణు దేశాయ్

  తాను రెండో పెళ్లి చేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ చేస్తున్న కామెంట్లపై రేణు దేశాయ్ స్పందించారు. ‘ఇలాంటి క్రేజీ అబ్బాయిలు ఇంట్లో వారి తల్లులు, సోదరీమణులతో ఎలా ప్రవర్తిస్తుంటారో? వారి మానసిక ఆరోగ్యం గురించి నేను చింతిస్తున్నాను' అని పేర్కొన్నారు.

  అందుకే అతడి వివరాలు గోప్యంగా

  అందుకే అతడి వివరాలు గోప్యంగా

  ఇలాంటి క్రేజీ ఫ్యాన్స్ ఉండటం వల్లే.... తన న్యూ హస్బెండ్ వివరాలు బయటకు చెప్పడానికి రేణు దేశాయ్ ఇష్ట పడటం లేదని తెలుస్తోంది. వారు ఏమైనా కీడు తలపెట్టే అవకావం ఉండటం వల్లనే ఆమె జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.

   రేణు దేశాయ్‌కు మద్దతు

  రేణు దేశాయ్‌కు మద్దతు

  అయితే తనకు మద్దతు ఇస్తున్న వారికి రేణు దేశాయ్ థాంక్స్ చెప్పారు. ‘నాకు అమ్మాయిల కన్నా అబ్బాయిల నుంచే ఎక్కువగా మద్దతు వస్తోందని నా పీఆర్‌ అసిస్టెంట్ చెప్పారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నాకు మద్దతు తెలుపుతున్న అబ్బాయిల తల్లిదండ్రులకు పేరు పేరునా ధన్యవాదాలు చెప్పాలని ఉంది. ఎంత చక్కగా పెంచారో వాళ్లని. ఈ తరం అబ్బాయిల్లో ఆడవాళ్లకు సమానత్వం ఇవ్వాలన్న విషయంలో స్పష్టత ఉంది. మీ అందరి మెసేజ్‌లకు ధన్యవాదాలు' అని పేర్కొన్నారు రేణూ.

  English summary
  Renu Desai engaged and Hiding her New Husband’s Identity. Renu Desai has revealed a multiple time that she is in search of a person who could share her life. Recently, she hinted that she found someone who could love her unconditionally and take of the kids.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more