twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇతర హీరోల ఫ్యాన్సే, బూతులు తిడుతున్నారు, చంపేస్తారేమో (రేణు దేశాయ్ ఇంటర్వ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ బుధవారం సాయంత్రం ఓ ఇంటర్వ్యూ వీడియో షేర్ చేసారు. ఈ ఇంటర్వ్యూ మొత్తం పవన్ కళ్యాణ్ గురించే సాగడం గమనార్హం. ఈ వీడియో పోస్టు చేసే ముందు ఆమె ఓ మెసేజ్ పెట్టారు.

    ఈ ఇంటర్వ్యూలోని విషయాలు నన్ను ఆదరించి, నా మంచికోరే అభిమానులను ఉద్దేశించి కాదు. అది ఫేస్ బుక్, ట్విట్టర్లో నా పర్సనల్ లైఫ్ గురించి వెకిలిగా ప్రవర్తిస్తున్న వారిని ఉద్దేశించి మాత్రమే. ఈ వీడియో చూసాక అయినా వారిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నాను. నా నిజమైన అభిమానులకు ఎప్పుడూ నేను కృతజ్ఞతతో ఉంటాను అని ఆమె తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పారో మీరూ ఓ లుక్కేయండి

    నేను పవన్ ఫోటో పెడితే, మాట్లాడితే తిడుతున్నారు

    నేను పవన్ ఫోటో పెడితే, మాట్లాడితే తిడుతున్నారు

    ప్రపంచంలో అందరూ పవన్ కళ్యాణ్ పెట్టుకోవచ్చు... నేను ఎందుకు పెట్టుకోకూడదుట. అందరూ పెడితే లైక్స్ వస్తున్నాయి....నేను ఆయన ఫోటోలు పెడితే, మాట్లాడితే తిట్లు వస్తున్నాయి. అందరూ కాదు...కొందరు కావాలని ఇలా చేస్తున్నారు. వారి ప్రాబ్లం ఏమిటో అర్థం కావడం లేదు అని రేణు దేశాయ్ ఆవేదన వ్యక్తం చేసారు.

    వారం క్రితం ఓ ఫోటో పోస్టు చేసా

    వారం క్రితం ఓ ఫోటో పోస్టు చేసా

    వారం క్రితం ఓ ఫోటో పోస్టు చేసాను. మేమిద్దరం కలిసి ఉన్నపుడు తీసిన ఫోటో అది. నేనొక ఫోటోగ్రాఫర్. ఆయనకు సంబంధించిన ఒక మూమెంటును నా కెమెరాలో కాప్చర్ చేసాను. ఆయన లుక్స్ చాలా బాగా వచ్చింది. దాన్ని అభిమానులతో షేర్ చేయాలనుకున్నాను. చాలా మంది ఫ్యాన్స్ హ్యాపీ పీలయ్యారు. కొందరు మాత్రం వెకిలిగా కామెంట్స్ చేసారని రేణు దేశాయ్ తెలిపారు.

    మీరెవరు నన్ను అనడానికి

    మీరెవరు నన్ను అనడానికి

    రేణు దేశాయ్ కి ఇపుడు అవసరమా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టడం. ఇప్పుడెందుకు రేణు దేశాయ్ అతని గురించి మాట్లాడుతోంది. విడిపోయి ఆరేళ్లయింది కదా...అంటూ కామెంట్స్ చేసారు. అలా అనడానికి మీరెవరు? నా ఇష్టం. ఆయన ఇష్టం. ఆయనకు ఇష్టం లేదంటే మాట్లాడను. మీరెవరు నన్ను అనడానికి అంటూ రేణు దేశాయ్ మండి పడింది.

    పబ్లిసిటీ కోసం చేస్తున్నానంటున్నారు

    పబ్లిసిటీ కోసం చేస్తున్నానంటున్నారు

    తనకు ఫ్రీ పబ్లిసిటీ కావాలి... అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నానని అంటున్నారు. లేకుంటే నా సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇదంతా సినిమా పబ్లిసిటీ కోసం చేస్తుందని అంటున్నారు. దానికి దీనికి సంబంధం ఏముంది. సినిమా ఎప్పుడు రిలీజైంది వేరే సమయంలో, నేను ఆయన ఫోటోలు పోస్టు చేసింది మరోసారి.... కావాలని నన్ను టార్గెట్ చేస్తున్నారంటూ రేణు దేశాయ్ సీరియస్ అయ్యారు.

    ఆయన పర్మిషన్ తీసుకున్నాను

    ఆయన పర్మిషన్ తీసుకున్నాను

    గతంలో బర్త్ డే ఇంటర్వ్యూ ఇచ్చిన సమయంలో కూడా ఆయన పర్మిషన్ తీసుకున్నారు. నేను ఇందులో పర్సనల్ విషయాలు మాట్లాడతానని కూడా చెప్పాను. ఆయన నీ జీవితం, నీ ఇష్టం అన్నారు. అప్పుడు నా సినిమా రిలీజ్ ఏమీ లేదు. కానీ సినిమా పబ్లిసిటీ కోసమే ఇలా చేసానంటూ కొందరు చెత్త కామెంట్స్ చేసారంటూ రేణు దేశాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    బద్రి షూటింగ్ అప్పటి నుండి ఆయనతో సహజీవనం చేస్తున్నాను

    బద్రి షూటింగ్ అప్పటి నుండి ఆయనతో సహజీవనం చేస్తున్నాను

    నేను ఆయనకు 11 సంవత్సరాలు భార్యగా ఉన్నాను. 17 సంవత్సరాలు బెస్ట్ ఫ్రెండ్ గా ఉన్నాను. ఆయన పొలిటికల్ జర్నీ క్లైమాక్స్ మీరు చూస్తున్నారిప్పుడు. బద్రి షూటింగ్ అప్పటి నుండి ఆయనతో సహజీవనం చేస్తున్నాను. ఆయన రాత్రి పూట మేలుకున్నపుడు ఎన్ని టీలు పెట్టానో నాకు తెలుసు. టీ కావాలని అయన కావాలి అన్నట్లు ఒక నవ్వు నవ్వే వారు. నేను చేసే టీ అంటే ఆయనకు చాలా ఇష్టం. కుక్ ను లేపి టీ పెట్టడం కాదు... నేనే వెళ్లి టీ పెట్టేదాన్ని అని అప్పటి రోజులను రేణు దేశాయ్ గుర్తు చేసుకున్నారు.

    విడిపోయినంత మాత్రాన ఆయన గురించి నేనెందుకు మాట్లాడకూదు

    విడిపోయినంత మాత్రాన ఆయన గురించి నేనెందుకు మాట్లాడకూదు

    ఆయనతో 17 సంవత్సరాలు జీవించాను. ఆయన పిల్లలకు తల్లిని నేను. విడిపోయినంత మాత్రాన ఆయన గురించి నేనెందుకు మాట్లాడకూదు. ఈ లాజిక్ ఏమిటో చెప్పండి. ఆయన నా ఫ్రెండ్.. మీరు మీ ఫ్రెండ్స్ గురించి మాట్లాడరా..? నేనెందుకు నా ఫ్రెండ్ గురించి మాట్లాడ కూడదు? మీరు మీ ఫ్రెండ్స్ ఫోటోగ్రాఫ్స్ పెట్టరా? అంటూ రేణు దేశాయ్ ప్రశ్నించారు.కొన్ని పర్సనల్ కారణాల వల్ల, పరిస్థితుల వల్ల విడిపోయాం. ఇద్దరం మ్యూచువల్ అండర్ స్టాండిగుతో విడిపోయాం. ఇన్నాళ్లు కలిసి ఉండి సంతకం పెట్టి విడిపోయిన తర్వాత ఒకరికొకరం పరిచయం లేనట్లు ఉండాలా? మా మధ్య గొడవలు ఏమీ లేదు. ఆ విషయం మీకు కూడా కనిపిస్తోంది. ఆయన పిల్లలను చూడటానికి కూడా పూణె వస్తుంటారు అని రేణు దేశాయ్ తెలిపారు.

    నోటికొచ్చినట్లు బూతులు తిడుతారు

    నోటికొచ్చినట్లు బూతులు తిడుతారు

    ఇతర హీరోల అభిమానులు సమయం కోసం చూస్తుంటారు. వారికి అవకాశం దొరికితే చాలు నోటికొచ్చినట్లు బూతులు తిడుతుంటారు. నేను ఆయన గురించి చిన్న మాట అంటే నా గురించి రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. కామెంట్స్ చేసే వాళ్లు ఫేక్ అకౌంట్లతో ఇలా చేస్తున్నారు. వారి పేరుండదు, అకౌంట్లో వారి ఇమేజ్ ఉండదు. వాళ్ల కామెంట్స్ నేను పట్టించుకోను. వాళ్ల మైండ్ సెట్ అంతే అనుకుని సరిపెట్టుకున్నాను చాలా సార్లు అని రేణు దేశాయ్ తెలిపారు.

    చదువుకున్న ఎడ్యుకేషన్స్ పర్సన్స్ కూడా

    చదువుకున్న ఎడ్యుకేషన్స్ పర్సన్స్ కూడా

    జాబ్ ప్రస్టేషన్, రిలేషన్ షిప్ ఫ్రస్టేషన్ ఉన్నవాళ్లు, సరిగా చదువు లేని వారు ఇలాంటి తిక్క కామెంట్స్ చేస్తుంటారని నేను అనడం లేదు. కొందరు ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఇలాంటివి చేస్తున్నారని రేణు దేశాయ్ తెలిపారు.

    హీరో తల్లి, చెల్లి గురించి కూడా చెత్త చెత్తగా

    హీరో తల్లి, చెల్లి గురించి కూడా చెత్త చెత్తగా

    ఇండస్ట్రీలో హీరోల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. అంతా బావుంటారు. అయితే వారి ఫ్యాన్స్ మాత్రం తమ హీరోల గురించి పొగుడుతారు. ఇతర హీరోలను తిడతారు. ఆ హీరో తల్లి, చెల్లి గురించి కూడా చెత్త చెత్తగా మాట్లాడతారు. అలా చేయడానికి మీరు ఏం హక్కు ఉంది. ఇంకొక వ్యక్తి వైఫ్ గురించి ఇలా చీఫ్ గా మాట్లాడటానికి మీరెవరు? అని రేణుదేశాయ్ ప్రశ్నించారు.

    నన్ను చంపేస్తారు!

    నన్ను చంపేస్తారు!

    నన్ను ట్విట్టర్, ఫేస్ బుక్ లో చాలా పెద్దగా తిట్టిన సందర్భాలు ఉన్నయి. కానీ నేను ఒక చిన్న వర్డ్ ఇడియట్ అంటే నన్ను చంపేస్తారు. నేను మాత్రమే కాదు ఎవరి విషయంలో అయినా ఇలానే అవుతుంది. బయట ప్రపంచానికి సెలబ్రిటీలు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండాలి, ఎవరినీ చిన్న మాట కూడా అనకూడదు... అంటే పెద్ద రచ్చ చేస్తారు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇష్టమొచ్చినట్లు అన్నా ఎవరూ పట్టించుకోరు అని రేణు దేశాయ్ వ్యాక్యానించారు.

    అలా అనండి... ఇలా ఏంటి?

    అలా అనండి... ఇలా ఏంటి?

    మీకు సినిమా నచ్చకుంటే, వారి యాక్టింగ్ నచ్చకుంటే నచ్చలేదు అని విమర్శించండి. అంతే కానీ వారి పర్శనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు, తిట్టే హక్కు మీకెక్కడిది. ఒక హీరో మీకు నచ్చితే ఫోలో కండి లేకుంటే మానేయండి. అంతే కానీ మీకు నచ్చని హీరో తల్లి, భార్య గురించి బూతులు మాట్లాడటం సంస్కారం కాదు. మీ తల్లి, చెల్లి విషయంలో ఇలా జరిగితే మీకెలా ఉంటుంది అంటూ రేణు దేశాయ్ కౌంటర్ ఇచ్చారు.

    నేనెందుకు సోషల్ మీడియాను అవాయిడ్ చేయాలి

    నేనెందుకు సోషల్ మీడియాను అవాయిడ్ చేయాలి

    ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా..? మీ భవిష్యత్ నిర్ణయం ఏమిటి? సోషల్ మీడియాను అవాయిడ్ చేస్తారా? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ... నేనెందుకు అవాయిడ్ చేయాలి. ఆయన నా ఫ్రెండ్, నా ఫ్రెండ్ పిక్చర్స్ నేను ట్వీట్ చేస్తాను, నా పిల్లల ఫోటోలు ట్వీట్ చేస్తాను నచ్చితే చూడండి, లేదంటే మానేయండి అంటూ రేణు దేశాయ్ మండి పడ్డారు.

    నోటికొచ్చినట్లు బూతులు తిడుతారు

    నోటికొచ్చినట్లు బూతులు తిడుతారు

    ఇతర హీరోల అభిమానులు సమయం కోసం చూస్తుంటారు. వారికి అవకాశం దొరికితే చాలు నోటికొచ్చినట్లు బూతులు తిడుతుంటారు. నేను ఆయన గురించి చిన్న మాట అంటే నా గురించి రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. కామెంట్స్ చేసే వాళ్లు ఫేక్ అకౌంట్లతో ఇలా చేస్తున్నారు. వారి పేరుండదు, అకౌంట్లో వారి ఇమేజ్ ఉండదు. వాళ్ల కామెంట్స్ నేను పట్టించుకోను. వాళ్ల మైండ్ సెట్ అంతే అనుకుని సరిపెట్టుకున్నాను చాలా సార్లు అని రేణు దేశాయ్ తెలిపారు.

    ఇకపై ఆయన గురించి రోజూ ట్వీట్ చేస్తా

    ఇకపై ఆయన గురించి రోజూ ట్వీట్ చేస్తా

    మీ ప్రాబ్లం మీరు చూసుకోండి... మీరే నచ్చకుంటే చూడకండి. నేను రోజూ ఆయన(పవన్ కళ్యాణ్) గురించి ట్వీట్ చేస్తాను, ఆయన ఒక హీరో, ఆయన్ను ఎంతో మంది ఫోటోస్ తీస్తారు.. వాటిని నేను రోజూ ట్వీట్ చేస్తాను అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ తో ఎలాంటి ప్రాబ్లం లేదని, వారు సంతోషంగా పీలవుతారని రేణు దేశాయ్ తెలిపారు.

    .

    English summary
    Renu Desai Speaks candidly about her current relation with Pawan Kalyan. She expresses her concern of public and fan interest in her friendly relationship with the power star.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X