ఇపుడు రేణుదేశాయ్ హీరో పవన్ కాదు, ఇతనే...(పిక్చర్స్)
హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఆయనతో విడిపోయిన తర్వాత తనకు తానుగా ఎదుగేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే నిర్మాతగా ప్రస్థానం ప్రారంభించిన రేణు దేశాయ్.....ఈ కాలంలో సినిమా తారలకు ముఖ్యంగా ఉండాల్సిన పాపులారిటీ, పబ్లిసిటీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇందుకు సోషల్ మీడియాను చాలా బాగా వాడుకుంటోంది రేణు దేశాయ్. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగు సైట్లలో ఆసక్తికరమైన పోస్టులు చేస్తూ అభిమానుల పెంచుకుంటోంది. రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారిలో పవన్ కళ్యాణ్ అభిమానులే ఎక్కువగా ఉన్నారు.
ఈ మధ్య తరచూ అభిమానులు అకీరా నందన్, ఆధ్యా ఫోటోలు పోస్టు చేయాలని కోరడంతో వారి కోరిక మేరకు వారి ఫోటోలు పోస్టు చేస్తోంది. కాగా.... పవన్ కళ్యాణ్‌తో ఉన్నంత కాలం అసలు బయటి ప్రపంచానికి టచ్‌లో రేణు దేశాయ్ ఉన్నట్టుండి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా మారడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆద్యాతో...
సెల్ఫి టైం విత్ మై ఏంజిల్ అంటూ....ఇలా తన కూతురు ఆద్యాతో కలిసి దిగిన ఫోటోను పోస్టు చేసింది రేణు దేశాయ్.

ఇతనే నా హీరో అంటూ...
నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణే తన సర్వస్వంగా బ్రతికిన రేణుదేశాయ్......ఇప్పుడు మాత్రం కొడుకు అకీరా నందనే నా హీరో అంటోంది. అందుకు సంబంధించిన ఫోటో ఇక్కడ చూడొచ్చు.

అభిమానుల రిక్వెస్ట్ మేరకు...
అభిమానుల చాలా కాలంగా రిక్వెస్ట్ చేస్తుండటంతో ఏప్రిల్ 8న అకీరా నందన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఫోటోను పోస్టు చేసింది రేణు దేశాయ్.

అభిమానుల కోసం స్పెషల్ అంటూ...
అభిమానుల కోసం స్పెషల్ పర్సనల్ పిక్చర్ అంటూ....ఈ ఫోటోను పోస్టు చేసింది రేణు దేశాయ్.


Click it and Unblock the Notifications











