పవన్ కి సపోర్ట్ కే రేణు దేశాయ్ ఓపెన్ చేసింది

By Srikanya

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు బ్రతుకుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఇక్కడ సినిమాలు,రాజకీయాలు అంటూ బిజీగా ఉంటే... రేణు తన పిల్లలతో కలిసి పూనేలో ఉంటున్నారు. అక్కడ ఆమె మరాఠి చిత్రాలు నిర్మాణంలో బిజీ అయ్యారు. అయితే పవన్ మీద ఆమెకు ప్రేమ, అభిమానం తగ్గలేదు. అందుకే ఆమె తాజాగా ట్విట్టర్ లో జాయిన్ అయ్యింది. ఆయనకు సపోర్ట్ చేయటానికే ట్విట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా... రేణూ దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. చాలా వాస్తవ దృక్పథం కలిగిన వ్యక్తి అని, మానవత్వం కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ దాదాపు తొలిసారి స్పందించారు. ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ పైన బహిరంగంగా స్పందిస్తున్నానని చెప్పారు. పవన్‌కు కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి అని, ఆయన హృదయం నిష్కళంకమైనదని చెప్పారు. పవన్‌లాంటి వాళ్లు కావాలి, మాకే తెలుసు: రేణు దేశాయ్ తామిద్దరు జీవితంలో ఏం జరిగిందో తమకు మాత్రమే తెలుసునని చెప్పారు.

తమ ఇద్దరి జీవితంలో ఏం జరిగిందో ఇతరులెవరికీ తెలియదన్నారు. తామిద్దరి జీవితంపై కామెంట్ చేసే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. సొసైటీకి ఏదో చేయాలని మనస్ఫూర్తిగా, నిజాయితీగా తపించే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవమని, ఆయనను తాను ఆరాధిస్తానని రేణు దేశాయ్ అన్నారు. తాను అప్పుడు.. ఇప్పుడు... ఎప్పుడు.. పవన్‌కు మద్దతుగా ఉంటానని చెప్పారు. తాను పవన్‌కు ఎప్పుడు అండగా నిలబడ్డానని, ఇక ముందు మద్దతుగా ఉంటానన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరమన్నారు.

Renu Desai finally lands on Twitter, to support Pawan Kalyan

నటిగా కంటే పవన్ కళ్యాణ్ భార్యగానే ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న వ్యక్తి రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్‌తో ఆమె బంధం, వివాహం తెలుగు సినిమా పరిశ్రమలో ఓ సెన్సేషన్. పెళ్లి తర్వాత భిన్నమైన ఆలోచనలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుటున్నారు రేణు.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన 'బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్. 'బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

రేణు దేశాయ్ నిర్మాతగా మారి 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X