Renu Desai: పవన్ ఫ్యాన్స్ ట్రోలింగ్‌పై రేణు దేశాయ్ ఫైర్.. ఒక తల్లికి పుట్టలేదా అంటూ!
రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. బద్రి సినిమాలో బంగాళ ఖాతంలో నీరంటే నువ్వేలే అనే సాంగ్ ఎంత పాపులరో.. అంతకుమించి ఫేమస్ అయ్యారు రేణు దేశాయ్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాందించుకున్నారు. హీరోయిన్గా బ్రేక్ ఇచ్చిన రేణు దేశాయ్ నటిగా, దర్శకురాలిగా మారి అలరించారు. 2012లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. అయితే తాజాగా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు.
లివింగ్ రిలేషన్ : తెలుగులో బద్రి సినిమాతో హీరోయిన్గా మోస్ట్ పాపులారిటీ సంపాందించుకున్నారు రేణు దేశాయ్. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నటించగా, వాళ్లిద్దరి జంటకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అతని పేరే అకీరా నందన్. తర్వాత పెళ్లి చేసుకున్నాక ఆద్య అనే అమ్మాయి జన్మించింది.

బుల్లితెరపై : పవన్ తో డివోర్స్ అనంతరం పిల్లలతోనే జీవితం గడుపుతున్నారు రేణు దేశాయ్. హీరోయిన్ గా విరామం తీసుకున్న ఆమె ఆ మధ్య దర్శకురాలిగా మారి ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. దర్శకురాలిగా, బుల్లితెరపై జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ పలు ఫొటోలు, పోస్ట్‌లతో నెటిజన్లకు టచ్‌లో ఉంటారు.
హద్దు దాటి : అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ అభిమానులపై రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8న అకీరా నందన్ 19వ పుట్టినరోజు. పవన్ కల్యాణ్ బర్త్ డేను ఎలా సంబరంగా జరుపుకుంటారో అకీరా పుట్టినరోజును పండుగల భావిస్తారు. ఈ సందర్భంగా అకీరాకు పవన్ అభిమానులు విషెస్ తెలియజేశారు. ఇందులో ఒక నెటిజన్ హద్దు దాటి ప్రవర్తించాడు. దీంతో తన స్టైల్ లో రిప్లై ఇచ్చారు రేణు దేశాయి.

ఇది చాలా అన్యాయం : "మేడమ్. ఇది చాలా అన్యాయం. మా అకీరాను ఒక్కసారి అయినా చూపించండి. మా అన్న కొడుకును చూడాలని మాకు ఉంటుంది. మీరు హైడ్ చేయకండి. అప్పుడప్పుడు అయినా వీడియోస్ లలో అకీరా బాబును చూపించండి" అని ఒక నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీనికి "మీ అన్న కొడుకు?? అకీరా నా అబ్బాయి. మీరు ఒక తల్లికి పుట్టలేదా. మీరు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అని నేను అర్థం చేసుకోగలను. కానీ, కొంచెం మాట్లాడే పద్ధతి నేర్చుకోండి. నేను ఇలాంటి మెసేజ్ లను చాలా ఇగ్నోర్ చేస్తా. కానీ కొంతమంది మాత్రం హద్దుదాటి చాలా కఠినంగా మాట్లాడుతున్నారు" అని తెలిపింది రేణు దేశాయ్.

11 ఏళ్లుగా చెడ్డదానిలా : "నేను ఇలాంటి కామెంట్స్ ను సాధారణంగా వదిలేసి డిలీట్ చేస్తా, బ్లాక్ చేస్తా. కానీ ఇవాళ నా కొడుకు పుట్టిన రోజున ఇలాంటి కామెంట్స్ చదవడం బాధిస్తోంది. సెన్స్ లేని కామెంట్" అని ఆ కామెంట్స్ ను స్క్రీన్ షాట్ తీసి షేర్ చేశారు రేణు దేశాయి. మరొక స్టోరీలో "11 ఏళ్లుగా నన్ను ఒక చెడ్డదానిలా, విలన్ గా చూస్తున్నారు. ఇదంతా చూసి చూసి విసిగి పోయాను. ఇక ఇలాంటి వాటికి రియాక్ట్ అయి నా మెంటల్ హెల్త్ ను పాడు చేసుకోలేను" అని రాసుకొచ్చారు.



Click it and Unblock the Notifications











