ఒక తల్లికి పుట్టి నన్ను బాధపెడతావా?... రేణు దేశాయ్ ఆవేదన!
Recommended Video
పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పూణెలో తన పిల్లలతో కలిసి ఉంటున్నారు. పిల్లలే తన ప్రపంచంగా జీవిస్తున్న ఆమె వారి బాగోగులు చూసుకుంటూనే తనకు ఎంతో ఇష్టమైన సినిమా రంగంలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే నిర్మాతగా, రచయితగా, దర్శకురాలిగా మరాఠిలో రెండు సినిమాలు చేసిన రేణు దేశాయ్.... ఫిల్మ్ మేకర్‌గా ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆమె తన తర్వాతి సినిమాకు స్క్రిప్టు రాసే పనిలో నిమగ్నమై ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో తనను బాధ పెట్టే విధంగా కామెంట్లు చేసే వారిపై తనదైన శైలిలో విరుచుకుపడే రేణు.... తాజాగా ఓ వెబ్ సైట్ పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక తల్లికి పుట్టి నన్ను బాధపెడతావా?
ఇప్పుడే ఎవరో నాకు ఇది పంపించారు. ఈ ఆర్టికల్ రాసిన వ్యక్తి ఒక తల్లికే పుట్టి ఉంటాడు. ఒక తల్లిని ఎప్పుడూ ఇలా బాధ పెట్టకూడదు అంటూ.... రేణు దేశాయ్ మండి పడ్డారు. రేణు దేశాయ్ పెట్టిన ఈ పోస్టుపై అభిమానులు వందల సంఖ్యలో స్పందించారు.

రేణు దేశాయ్ అంతలా ఫీలవ్వడానికి కారణం ఏమిటి?
సదరు వెబ్ సైట్ వారు.... రేణు దేశాయ్ తన పిల్లలతో కలిసి దిగిన ఫోటోస్ షేర్ చేశారు. ‘‘పవన్ కళ్యాణ్ పిల్లలు అతడి మాజీ భార్య రేణు దేశాయ్‌తో..'' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇలా పేర్కొనడం ఆమెకు చాలా కోపం తెప్పించింది. వెంటనే తన సోషల్ మీడియా పేజీ ద్వారా ఘాటుగా స్పందించింది.

రేణు దేశాయ్ చాలా స్ట్రాంగ్ ఉమెన్
రేణు దేశాయ్ చేసిన ఈ పోస్ట్ చూసిన అభిమానులు..... ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అంటూ ప్రశంసలు గుప్పించారు. ఆమను బాధ పెట్టే విధంగా ఇలాంటి క్యాప్షన్ పెట్టడం సరైంది కాదు అని మరికొందరు కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.

రూమర్లపై వెంటనే స్పందిస్తున్న రేణు దేశాయ్
తనపై ఏ రూమర్ వచ్చినా రేణు దేశాయ్ వెంటనే స్పందిస్తున్నారు. ఇటీవల బిగ్ బాస్ తెలుగు 3లో రేణు దేశాయ్ పాల్గొనబోతోందనే వార్తలు రాగా ఆమె సోషల్ మీడియా పేజీ ద్వారా రియాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం లేదు. అదంతా తప్పుడు ప్రచారమే అని స్పష్టం చేశారు. తనకు బిగ్ బాస్ షోలో కంటెస్ట్ చేయడం కంటే ఆ షోను హోస్ట్ చేయడాన్ని చాలా ఇష్టపడతాను. అయితే అలాంటి అవకాశం నాకు వస్తుందో లేదో తెలియదు. కానీ ఇలాంటి హిట్ షోను హోస్ట్ చేస్తే ప్రజెంటర్‌గా నా స్కిల్స్ మరింత డెవలప్ చేసుకోవచ్చని భావిస్తున్నాను... అని ఓ ఆంగ్లపత్రికతో రేణు దేశాయ్ తెలిపారు.


Click it and Unblock the Notifications











