మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు: ట్వీట్ కి రేణూ దేశాయ్ ఘాటు సమాధానం
సహనం ఎంతాకాలం ఉన్నా లాభం లేదని అర్థమయ్యిందేమో గానీ మొన్న మళ్ళీ పెళ్ళి వ్యాఖ్యల దగ్గరినుంచీ ఎవరినీ అంత లైట్ తీసుకోవటం లేదు రేణూ దేశాయ్.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ఈ మధ్య మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని తెలిపిన విషయం తెలిసిందే. ఆ మాట తెలిపిన తర్వాత పవన్ ఫ్యాన్స్ నుండి అనేక రకాల కామెంట్స్‌ని ఆమె ఫేస్ చేస్తోంది. అనంతరం మీ ఇంట్లో అమ్మకో, అక్కకో అయితే అంటూ కాస్త ఎమోషన్‌గానే రియాక్ట్ అయింది రేణుదేశాయ్. అభిమానుల నుండి బెదిరించే కామెంట్స్ వచ్చినా కూడా రేణు మాత్రం బెదరకుండా స్ట్రైట్ గానే సమాధానాలు చెప్పింది...
Recommended Video


లైట్ తీసుకోవటం లేదు
అయితే ఆ ఎఫెక్ట్ నుంచి ఇంకా రేణూ బయట పడ్డట్టు లేదు. గతం లో ఎప్పుడూ కోపంగా మాట్లాడి ఆమె ఈ మధ్య వచ్చే కొన్ని ప్రశ్నలకు ఘాటు గానే సమాధానం చెప్తోంది. సహనం ఎంతాకాలం ఉన్నా లాభం లేదని అర్థమయ్యిందేమో గానీ మొన్న మళ్ళీ పెళ్ళి వ్యాఖ్యల దగ్గరినుంచీ ఎవరినీ అంత లైట్ తీసుకోవటం లేదు రేణూ దేశాయ్.

రేణు దేశాయ్‌కి ఆగ్రహం
ఈ నేపథ్యం లో నెటిజన్ ట్వీట్ రేణు దేశాయ్‌కి ఆగ్రహం తెప్పించింది. ఇటీవల ఓ డ్యాన్స్ షోకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ షోలో అంతా రియల్ లైఫ్ కపుల్ తమ నాట్యంతో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ డాన్స్ షో లో రేణూ జడ్జ్ గా వ్యవహరించటం ఒక ప్రత్యేక ఆకర్శణగా ఉంది.

వారెవరూ డ్యాన్సర్స్ కాదు
అయితే ఇటీవల ఓ నెటిజన్ ఈ షోపై కామెంట్ చేశారు. "ఆ షోలో పెర్ఫార్మ్ చేస్తున్నవారెవరూ డ్యాన్సర్స్ కాదు.. వాళ్లు మళ్లీ సీరియల్స్ చేసుకోవడం బెటర్.. వారిని డ్యాన్సర్లుగా చూడలేకపోతున్నాం" అని చరణ్ అనే నెటిజన్ రేణుకు ట్వీట్ చేశాడు. అంతే మామూలుగా అయితే సమాధానం వేరుగా ఉండేదేమో గానీ ఈసారి ఊరుకోలేదు...

నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు
ఈ ట్వీట్‌పై రేణు ఆగ్రహం వ్యక్తం చేశారు. "నీవు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఈ షో కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసమే.. సీరియస్ డ్యాన్స్ కాంపిటీషన్ కాదు. ఇది నిజ జీవిత సెలబ్రిటీ జంటలతో చేస్తున్న షో" అని రీ ట్వీట్ చేసింది.ఏదైనా భరించే వరకే మరీ సొంత విషయాల్లో కూడా జోక్యం చేసుకున్నాక సహనం ఎన్నాళ్ళుంటుంది. రేణూ దేశాయ్ ఇక మరీ సాఫ్ట్ గా ఉంటే కుదరదేమో.


Click it and Unblock the Notifications











