ఓటు ఎవరికేస్తే మీకెందుకు? నాకే ఉపన్యాసాలా?... పవన్ ఫ్యాన్స్‌పై రేణుదేశాయ్ ఫైర్

Recommended Video

Renu Desai Strong Reply To Pawan Kalyan Fans || Filmibeat Telugu

సినీ నటి రేణుదేశాయ్ నెటిజన్లకు గట్టిగా క్లాస్ పీకారు. ఏపీలో ఎన్నికలు హోరా హోరీగా జరుగుతున్న సమయంలో నెటిజన్లు ఇచ్చే సూచనలు, సలహాలపై గుర్రుమన్నారు. తనకు ఎలా ఓటు వేయాలో.. ఎవరికి ఓటు వేయాలని చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దాంతో ఆమె తన ఓటు హక్కు గురించి ఇన్స్‌టాగ్రామ్‌లో స్పష్టం చేశారు. ఆమె ఏమన్నారంటే..

మాకు ఓటు వేయండి అంటూ

మాకు ఓటు వేయండి అంటూ

పలువురు తమ ఓటు హక్కును వినియోగించుకొన్న తర్వాత జనసేన పార్టీకి, పవన్ కల్యాణ్‌కు ఓటు వేయాలని రేణు దేశాయ్ వాల్‌పై ఫొటోలు పెట్టి విసిగించారు. దాంతో ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టి రంగంలోకి దిగారు. ఈ పోస్టు జనహితం కోసం పెడుతున్నాను అని ఘాటుగా స్పందించారు.

 దయచేసి మెసేజ్‌లు ఆపండి

దయచేసి మెసేజ్‌లు ఆపండి

నేను నా ఓటు హక్కును పూణేలో ఏప్రిల్ 23న వినియోగించుకొంటున్నాను. దయచేసి నాకు మెసేజ్‌లు పెట్టడం ఆపండి. అలాగే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి లెక్చర్లు ఇవ్వడం ఆపండి. ఇంకు పెట్టుకొన్న వేళ్లను నా సోషల్ మీడియా అకౌంట్లకు ట్యాగ్ చేయకండి అని అన్నారు.

 ఓటు హక్కు గురించి నాకే ఉపన్యాసాలా?

ఓటు హక్కు గురించి నాకే ఉపన్యాసాలా?

నా సోషల్ మీడియా అకౌంట్ల వాల్స్‌పై రకరకాల సందేశాలతో నాకు సలహాలు ఇస్తున్నారు. మీరు నాకు ఓటు హక్కు ప్రాధాన్యం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం ఆపండి. నాకు నచ్చిన వ్యక్తికి, పార్టీకి 23న ఓటు వేస్తున్నాను అని గట్టిగా సమాధానం ఇచ్చింది.

 అన్నదాత సుఖీభవపై రేణుపై ట్రోల్స్

అన్నదాత సుఖీభవపై రేణుపై ట్రోల్స్

ఇక కెరీర్ విషయానికి వస్తే.. ఆంధ్ర ప్రదేశ్‌లో రైతులు ఆత్మహత్యలు, సమస్యలను తెలిపే అన్నదాత సుఖీభవ టెలివిజన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ షో నేపథ్యంలో రేణుదేశాయ్ కొందరు నెటిజన్లు అసభ్య పదజాలంతో దూషించారు. దాంతో తాను ఓ స్వచ్ఛంద సంస్థ తరఫున పనిచేయడానికి వచ్చాను అని స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X