పనీపాటాలేని మూర్ఖులే ఇలా, అకీరాకు మెసేజ్ పెట్టా.. రేణు దేశాయ్!
Recommended Video

రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియా నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఆమె కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గ పర్యటన హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అందుకు కారణం పవన్ కళ్యాణ్ కూడా అదే నియోజకవర్గంలో, అదే సమయంలో పర్యటించారు. రేణు దేశాయ్ రైతులని కలసి వారి సమస్యలని తెలుసుకున్నారు. రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ పర్యటనలు ఒకేసారి కర్నూలు జిల్లాలో జరగడంతో రాజకీయ చర్చ కూడా సాగింది. తన పర్యటనకు ఎలాంటి రాజకీయ సంబంధం లేదని రేణు దేశాయ్ ఆ సమయంలో క్లారిటీ ఇచ్చింది. అయినా కూడా కామెంట్స్ ఆగకపోవడంతో మరోమారు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా సమాధానం ఇచ్చారు.

రెండు నెలల క్రితమే
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు, నేను ఒకేసారి కర్నూలు జిల్లాలో పర్యటించడం వలన అనేక ఊహాగానాలు, పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారు. నా పర్యటనకు ప్లానింగ్ రెండు నెలల క్రితమే జరిగింది. వాస్తవానికి వారం రోజుల ముందే నా పర్యటన జరగాల్సింది. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన వాయిదా వేశాం. ఇది కేవలం అనుకోకుండా జరిగిన సంఘటన అని రేణు దేశాయ్ అన్నారు.

రైతుల సమస్యలపై
తాను రైతుల సమస్యల గురించి ఓ చిత్రనిచేస్తునట్లు రేణు దేశాయ్ వివరించారు. దానికి సంబంధించి రైతులతో ఓ షో చేయాలని అనుకున్నాం. అందుకోసమే కర్నూలులో పర్యటించినట్లు రేణు దేశాయ్ అన్నారు. దీనికి అనవసరమైన ఊహాగానాలు చేస్తూ, కొందరు రాజకీయం చేసే పనిలో ఉన్నారని రేణు మండిపడ్డారు. ఒక వేళ నేను ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలి అనుకుంటే అది సీక్రెట్ గా ఎందుకు ఉంటుంది అని రేణు ప్రశ్నించారు. నేను కళ్యాణ్ గారు అనుకోకుండా ఒకే సమయంలో, ఒకే సమస్య గురించి మాట్లాడినంత మాత్రాన రాజకీయం అయిపోదు అని రేణు తెలిపారు.

పనీపాటా లేని మూర్ఖులు
ఈ విషయం గురించి అనవసరమైన కామెంట్స్ చేసేవారంతా పనీపాటా లేని మూర్ఖులు, బుద్ది లేని మనుషులు అంటూ రేణు దేశాయ్ ఘాటుగా స్పందించారు. ఒక మంచి పని కోసం వస్తే ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అని రేణు మండిపడింది. యాదృచ్చికంగా జరిగే సంఘటనాలు అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు ఇలాంటి కామెంట్స్ చేయరు అని రేణు అభిప్రాయపడ్డారు.

అకీరాకు మెసేజ్ పెట్టా
కళ్యాణ్ గారు కూడా అదే టౌన్ లో ఉన్నారని తెలియగానే అకీరాకు మెసేజ్ పెట్టా. మీ నాన్న, నేను ఒకే టౌన్ లో ఉన్నాం అని చెప్పగానే అకిరా చాలా సంతోషించాడు. ఇక మీకేంటి సమస్య అని రేణు ప్రశ్నించింది. కొన్ని మీడియా ఛానల్స్ కూడా తనకు తలనొప్పిగా మారాయని రేణు విమర్శించారు.


Click it and Unblock the Notifications











