11 ఏళ్లు నాతో కాపురం చేసి.. మరో అమ్మాయితో బిడ్డను కంటే ఊరుకుంటారా?.. రేణు దేశాయ్

By Bojja Kumar

Recommended Video

Renu Desai Explains About Incidents In Her Life

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత ఆయన విదేశీ మహిళను మరో పెళ్లి చేసుకోవడం, ఆవిడ ద్వారా పిల్లల్ని కూడా కనడం తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల పాటు తన ఇద్దరు పిల్లల పెంపకంలో మునిగిపోయి పూణెలో ఒంటరిగా జీవితం గడుపుతున్న రేణు దేశాయ్.... పెద్దలు, ఫ్యామిలీ మెంబర్స్ సూచన మేరకు తన జీవితానికి కూడా ఒక మగ తోడు అవసరం అనే నిర్ణయానికి వచ్చి రెండో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆ నిర్ణయంతో రేణు దేశాయ్ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్వరలో మరొక వ్యక్తిని పెళ్లాడబోతున్న రేణు దేశాయ్ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

లేడీస్ మైండ్ సెట్ మారాలి

లేడీస్ మైండ్ సెట్ మారాలి

కొందరు లేడీస్ కూడా నీకెందుకు మరో పెళ్లి? ఇద్దరు పిల్లలు ఉన్నది సరిపోవడం లేదా అని కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. అది చదివినపుడు చాలా బాధ అనిపించింది పెళ్లి అనేది కేవలం పిల్లల కోసం కాదు కదా? మనకంటూ జీవితంలో ఒక తోడు, మనకంటూ ఒక సపోర్ట్ కోసమే. అది వారు ఎందుకు ఆలోచించలేదో అర్థం కాలేదు. కొందరు లేడీస్ మైండ్ సెట్ కూడా మారాల్సిన అవసరం ఉంది.

మరో అమ్మాయితో బిడ్డను కంటే ఊరుకుంటారా?

మరో అమ్మాయితో బిడ్డను కంటే ఊరుకుంటారా?

నన్ను మాటలు అంటున్న లేడీ ఫ్యాన్స్‌కు ఒకటే చెబుతున్నాను. మీరు కూడా నాలాంటి పరిస్థితిలో, నా స్థానంలో ఉంటే.... 11 సంవత్సరాల పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఒక అమ్మాయితో బిడ్డను కని ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుంది?

ఆయన మంచి వారు, వ్యక్తిగత జీవితంతో ముడి పెట్టవద్దు

ఆయన మంచి వారు, వ్యక్తిగత జీవితంతో ముడి పెట్టవద్దు

మా మధ్య ఏం జరిగింది అనేది వివరంగా చెబితే కళ్యాణ్ గారికి ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే ఆయన పొలిటికల్ జర్నీ మొదలు పెట్టారు. సోషల్‌గా కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి. ఈ విషయం చాలా సందర్బాల్లో చెప్పాను. ఆయనకు డబ్బు ఇష్టం లేదు. జనాల కోసం ఏదైనా చేయాలని మనసులో నిజంగా ఉంది. వ్యక్తిగత జీవితాన్ని, పొలిటికల్ జీవితానని ముడి పెట్టవద్దు.

అప్పుడే ట్వీట్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో

అప్పుడే ట్వీట్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదేమో

కళ్యాణ్ గారు మొన్న మా ఎంగేజ్మెంట్ అపుడు విష్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదే కొన్ని సంవత్సరాల ముందు చేసి ఉంటే నాకు వేధింపులు, కామెంట్స్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది కాదేమో.

ఆవిడను వదినా అని పిలవండి, నన్ను కాదు

ఆవిడను వదినా అని పిలవండి, నన్ను కాదు

కళ్యాణ్ గారికి ఒక భార్య ఉంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారితో కలిసి జనాల్లోకి వస్తున్నారు. ఆమెను వదినా అని పిలవండి, ఆవిడపై మీ ప్రేమ చూపించండి. దయచేసి నన్ను వదిలేయండి. అదే సమయంలో నన్ను తిట్టడం కూడా మానేయండి. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు.

మాకు ప్రైవసీ ఇవ్వండి

మాకు ప్రైవసీ ఇవ్వండి

నేను మరో ఇంటి కోడలు కాబోతున్నాను, వేరొక వ్యక్తి భార్య కాబోతున్నాను. మాకు ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను డైరెక్షన్ చేస్తున్నాను, సినిమాలు నిర్మిస్తున్నాను. కవితలు రాస్తున్నాను.... మాట్లాడాలనుకుంటే వాటి గురించి మాట్లాడండి. కానీ నా వ్యక్తి గత జీవితంలోకి రావొద్దు.

పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతా, ఆయకు అభ్యంతరం లేదు

పెళ్లి తర్వాత సినిమాల్లో కొనసాగుతా, ఆయకు అభ్యంతరం లేదు

పెళ్లి తర్వాత కూడా నా వృత్తి కొనసాగిస్తాను. సినిమాలు, డైరెక్షన్, ప్రొడక్షన్ కంటిన్యూ అవుతాయి. వెబ్ సిరీస్ తీసే ఆలోచన ఉంది. నాకు కాబోయే భర్తకు వీటిపై ఎలాంటి అభ్యంతరం లేదు. ఆయన మెచ్యూర్డ్ మ్యాన్.

ఆయన మంచి వ్యక్తి.... త్వరలో ప్రేమలో పడతాం

ఆయన మంచి వ్యక్తి.... త్వరలో ప్రేమలో పడతాం

నాకు కాబోయే వారు చాలా మంచి వ్యక్తి. నేనంటే ఆయనకు చాలా ఇష్టం ఉంది. నాకు ఆయనంటే చాలా ఇష్టం. ఇద్దరం కలిసి ఉంటే సంతోషంగా ఉంటామనే నమ్మకంతో పెళ్లి చేసుకుంటున్నాం. అయితే ఇద్దరి మధ్య ప్రేమలో పడిపోవడాలు లాంటివి జరుగలేదు. ఏదో ఒక రోజు మేము ప్రేమలో పడిపోతాం.

పిల్లలకు కూడా ఆయన క్లోజ్ అయ్యారు

పిల్లలకు కూడా ఆయన క్లోజ్ అయ్యారు

అకీరా, ఆద్యా కూడా ఆయతో చాలా క్లోజ్ అయ్యారు. ఆయన నా పిల్లలను తన సొంత పిల్లలుగా యాక్సెప్ట్ చేశారు కాబట్టే ఈ పెళ్లికి ఒప్పకున్నాను. ఇకపై మా జీవితం మరింత సంతోషంగా ఉంటుందని భావిస్తున్నాను అని రేణు దేశాయ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X