అకీరా కోసం రెండు లక్షల మంది.. నిజం కాదంటున్న రేణు దేశాయ్!
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలంగా వెండి తెరకు దూరమయ్యారు. రాజకీయాల్లో బిజీ కావడంతో పవన్ కళ్యాణ్ మానియాని అభిమానులు సినిమాల్లో మిస్ అవుతున్నారనే చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా టీనేజ్ లోనే సోషల్ మీడియా స్టార్ గా మారిపోతున్నాడు. పవన్ మాజీ భార్య దేశాయ్ తరచుగా అకిరా ఫోటోలని, విశేషాలని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల అకిరా నందన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాడంటూ జరుగుతున్న ప్రచారంపై రేణు దేశాయ్ స్పందించింది.

రేణు దేశాయ్ స్పందన
ఇటీవల అకీరా నందన్ పేస్ బుక్, ట్విట్టర్ లో ఖాతా ఓపెన్ చేశాడని ప్రచారం జరిగింది. అకీరా పేరు మీద పోస్ట్ లు కూడా వస్తున్నాయి. దీనితో ఆ అకౌంట్స్ కు ఫాలోవర్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు అకీరాకు సంబంధించిన విశేషాలని రెండు దేశాయ్ మాత్రమే సోషల్ మీడియాలో పంచుకునేదు. కానీ ఇకపై స్వయంగా అకీరానే సామజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ముచ్చటించబోతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.

ఎదుగుతున్నాడు
రేణు దేశాయ్ మాట్లాడుతూ.. అకీరా ఇప్పుడే ఎదుగుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఆయన వారసత్వాన్ని అకీరా కొనసాగించాలని కోరుకుంటున్నారు. అకీరా సినిమాల్లో నటించడం కోసం అభిమానులు ఇప్పటి నుంచే ఎదురుచూస్తూ సోషల్ మీడియాలో తనకు కామెంట్స్ పెడుతున్నట్లు రేణు దేశాయ్ తెలిపారు. అకీరా పేరు మీద 2 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఓ పేస్ బుక్ పేజీ వైరల్ అవుతోంది. వాస్తవానికి అకీరా ఇంతవరకు ఎలాంటి సోషల్ మీడియా ఖాతాని ఓపెన్ చేయలేదు అని రేణు దేశాయ్ తెలిపారు.

ఫేక్ అకౌంట్
అకీరా పేరు మీద ఓపెన్ చేసి ఉన్న ఖాతాలన్నీ అభిమానులు క్రియేట్ చేసినవని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల అకీరా పేరు మీద ఉన్న సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో అనారోగ్యానికి గురైనప్పుడు అకీరానే స్వయంగా పేస్ బుక్, ట్విట్టర్ లో కామెంట్ పెట్టాడని అభిమానులు భావించారు. అది నిజం కాదని రేణు దేశాయ్ వ్యాఖ్యల ద్వారా అర్థం అయింది.

నటిగా రీఎంట్రీ
ఇదిలా ఉండగా రేణు దేశాయ్ తరచుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్యన రేణు దేశాయ్ కర్నూలు జిల్లాలో రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే. రైతులపై రేణు దేశాయ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. నటిగా కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రేణు దేశాయ్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











