పవన్‌తో అకిరా విజయవాడకు వెళ్లడంపై ఉహాగానాలు.. ఒక్క ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చిన రేణు దేశాయ్!

Recommended Video

Renu Desai Gives Clarity On Akira With Pawan In Vijayawada

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కొత్త వివాహ జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ తన పిల్లలు అకిరా, ఆద్యతో పుణేలో ఉంటున్నారు. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు ఆమె ఓ వ్యక్తిని త్వరలో వివాహం చేసుకోబోతోందనే వార్తలకు బలాన్నిచ్చాయి. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. ప్రస్తుతం పవన్, రేణు తనయుడు అకిరా పేరు కూడా సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ప్రస్తుతం అకిరా పవన్ తో ఉండడంపై వస్తున్న ఊహాగానాలకు రేణు స్పందించింది.

జూనియర్ పవర్ స్టార్

జూనియర్ పవర్ స్టార్

పవన్ కళ్యాణ్ ఫాన్స్ అకిరాని జూనియర్ పవర్ స్టార్ అని పిలవడం ప్రారంభించేశారు. దీనిపై కూడా ఇటీవల రేణుదేశాయ్ స్పందించింది. అకిరాని ఎవరూ జూనియర్ పవర్ స్టార్ అని పిలవద్దని అలా చేస్తే వారిని బ్లాక్ చేస్తా అంటూ కూడా రేణు దేశాయ్ హెచ్చరించింది. అలా పిలవడం పవన్ తో పాటు తనకు, అకీరాకు కూడా ఇష్టం లేదని తెలిపింది.

పెళ్లి వార్తలు

పెళ్లి వార్తలు

రేణు దేశాయ్ ఇటీవల సోషల్ మీడియాలో రేండు చేతులు కలసి ఉన్న పిక్ ని పోస్ట్ చేసి ఈ చేయిని ఎప్పటికి విడువకు అంటూ కామెంట్ పెట్టింది. దీనితో రేణుదేశాయ్ త్వరలో పెళ్ళికి సిద్ధం అవుతోంది అంటూ ప్రచారం మొదలైంది.

పవన్ తో అకిరా

పవన్ తో అకిరా

శుక్రవారం పవన్ కళ్యాణ్ విజయవాడలో పర్యటించారు. సతీసమేతంగా పవన్ పటమటలో అద్దెకు తీసుకున్న నూతన గృహంలోకి గృహప్రవేశం చేసారు. పవన్ తో పాటు అకిరా కూడా విజయవాడకు వెల్ళడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఉహాగానాలు

ఉహాగానాలు

పవన్ తో అకిరా ఉండడంతో ఉహాగానాలు మొదలయ్యాయి. అకిరా ఇక హైదరాబాద్ కు షిఫ్ట్ కానున్నాడని వార్తలు వచ్చాయి. అకిరా గురించి చిన్న వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ వ్యాపిస్తోంది.

రేణుదేశాయ్ స్పందన

పవన్ తో అకిరా విజయవాడ వెళ్లడంపై రేణు దేశాయ్ స్పందించింది. అకీరాకు ప్రస్తుతం స్కూల్ హాలిడేస్. అందువలన సెలవులకి తన తండ్రితో గడుపుతున్నాడు. అతడి హైదరాబాద్ కు మారిపోలేదు అంటూ రేణుదేశాయ్ స్పందించింది.

అందుకోసమే ఈ మెసేజ్

అందుకోసమే ఈ మెసేజ్

అకిరా విజయవాడ వెళ్ళినప్పటి నుంచి పలు రకాల వార్తలు వస్తున్నాయి. అందుకే తాను ఈ మెసేజ్ పెడుతున్నానని రేణుదేశాయ్ క్లారిటీ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X