రేణు దేశాయ్ లాజిక్ మిస్ అయ్యిందంటూ ట్రోలింగ్.. విడాకుల తేదీ, పోలినా బర్త్ డే ఇదే అంటూ రేణు కౌంటర్!

Recommended Video

Renu Desai Comments On Pawan Kalyan

రెండు దేశాయ్ రెండవ వివాహం విషయం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో రెండు దేశాయ్ రెండవ వివాహం, పవన్ కళ్యాన్ తో విడాకుల విషయం గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. రేణు దేశాయ్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఈ ట్రోలింగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్నారా, ఆ ముసుగులో కొందరి ట్రోలింగ్ కి పాల్పడుతున్నారా అనే విషయం కూడా రచ్చగా మారింది. ఏది ఏమైనా ఈ విషయంలో రెండు దేశాయ్ కూడా కొంత ఘాటుగానే స్పందిస్తోంది. తనని ట్రోలింగ్ చేసే వారికి గట్టిగా కౌంటర్ ఇస్తోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తో విడాకులకు దారి తీసిన పరిస్థితుల గురించి రేణుదేశాయ్ వివరించింది. ఈ విషయం లో తనని ట్రోల్ చేస్తున్న వారికి ధీటైన సమాధానం ఇచ్చేలా రేణు దేశాయ్ పీఆర్ టీం స్పందించింది.

తనతో ఉండగానే మరో మహిళతో

తనతో ఉండగానే మరో మహిళతో

తనతో కాపురం చేస్తుండగానే పవన్ కళ్యాణ్ మరో మహిళతో బిడ్డకు జన్మనిచ్చాడని రేణు దేశాయ్ తెలిపింది. ఈ పరిస్థితులే విడాకులకు దారి తీశాయని తెలిపింది. పవన్ నుంచి తాను విడాకులు కోరుకోలేదని తెలిపింది.

పోలినాకు జన్మ

పోలినాకు జన్మ

అన్నా లెజినోవా తో కలసి పవన్ కళ్యాణ్ పోలినా కు జన్మనిచ్చాడు. ఈ వ్యవహారం తరువాతే తమ మధ్య విడాకులు జరిగాయని రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

అంతా కన్ఫ్యూషన్

అంతా కన్ఫ్యూషన్

ఈ విషయంలో కొందరు సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ వ్యాఖ్యలని తప్పు బడుతున్నారు. పవన్ కళ్యాణ్ పోలినా కు జన్మనివ్వడం వలనే విడిపోయాం అని చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కన్ఫ్యూషన్ నెలకొని ఉంది.

ఫ్యాన్స్ వాదన

ఫ్యాన్స్ వాదన

పవన్, రేణు మధ్య విడాకులు ఖరారైంది 2011 లో అని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ పోలినా జన్మించింది 2013 లో.. దేని వలన రేణు దేశాయ్ అబద్దం చెబుతున్నారనే విషయం స్పష్టం అవుతోందని ఫ్యాన్స్ వాదిస్తున్నారు.

తేదీలతో సహా రేణు స్పందన

సోషల్ మీడియాలో గందరగోళం నెలకొని ఉండడంతో రెండు దేశాయ్ తన పీఆర్ టీం ద్వారా స్పందించారు. తేదీలతో సహా ఆమె పవన్ ఫాన్స్ కు కౌంటర్ ఇచ్చారు. పోలినా జన్మించింది 13 మార్చి 2012 లో అని రేణు దేశాయ్ క్లారిటీ ఇచ్చారు.

అంటే 2011 లోనే

దీని ద్వారా అన్నా లెజినోవా గర్భం దాల్చింది 2011 జులైలో అని స్పష్టం అవుతోంది.విడాకులు ఖరారు అయింది 16 మార్చి 2012 న అని రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు. ఫాన్స్ మధ్య గందరగోళం నెలకొని ఉండడం వలనే తాను ఈ వివరణ ఇస్తున్నానంటూ రేణు దేశాయ్ తన పిఆర్ టీం ద్వారా వివరించారు.

త్వరలో వివాహం

త్వరలో వివాహం

రేణు దేశాయ్ త్వరలో రెండవ వివాహానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికి తనకు కాబోయే భర్త విషయాన్ని రేణు దేశాయ్ గోప్యంగానే ఉంచింది. తన తప్పు లేకుంటే నిజాన్ని బయటపెట్టడంలో భయం అవసరం లేదని తనకు కాబోయే భర్త తరుపున బంధువులు ధైర్యాన్ని ఇచ్చారని, అందువనే తాను ఈ విషయాలు చెబుతున్నాని ఇటీవల రేణు దేశాయ్ తెలిపిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X