నా కవిత వలన పవన్ కళ్యాణ్ టార్గెట్ అయ్యారా? అదెలాగ.. ఘాటుగా కౌంటర్ ఇచ్చిన రేణు దేశాయ్!
Recommended Video

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయాకు కూడా స్నేహితులుగా కొనసాగుతున్నారు. పిల్లలకోసం పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడూ పూణేకు వెళుతుండడం గమనిస్తూనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికి తనని వదినా అనిపిలుస్తూ మద్దతుగా నిలుస్తున్నారని, మరి కొందరు ఇబ్బంది పెడుతున్నారని రేణుదేశాయ్ పలు సందర్భాల్లో అన్నారు. సోషల్ మీడియాలో రేణు దేశాయ్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన విషయాలని అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల రెండు దేశాయ్ సోషల్ మీడియాలో ఓ కవితని పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ వలన దేశాయ్ పవన్ అభిమానుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రేణు కూడా అంతే ఘాటుగా స్పందించారు.

విడిపోయాక కూడా స్నేహంగా
రెండు దేశాయ్, పవన్ కళ్యాణ్ విడిపోయాక కూడా స్నేహంగా మెలుగుతున్నారు. రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కు సంబందించిన పలు విషయాలని అభిమానులతో పంచుకుంటున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్
సోషల్ మీడియాలో రేణు దేశాయ్ చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయాన్ని ఆమె అభిమానులతో పంచుకుంటారు. దీనితో కొన్ని సార్లు రేణు దేశాయ్ అభిమానుల నుంచి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు.

వీడియోతో మరో మారు
ఇటీవల రేణు దేశాయ్ కవిత రూపంలో ఓ వీడియోని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో పోస్ట్ చేసారు.

వీడియోపై పవన్ ఫాన్స్ అభ్యంతరం
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ వీడియోని వ్యతిరేకిస్తూ కామెంట్లు పెండుతున్నారు. ఇలాంటి పోస్ట్ లు పెట్టడం వలన పవన్ కళ్యాణ్ ఇతర రాజకీయ నాయకులకు టార్గెట్ గా మారుతున్నారని ఓ అభిమాని కామెంట్ పెట్టాడు.
రేణు దేశాయ్ ఘాటు రిప్లై
ఈ కామెంట్ కు రేణు దేశాయ్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. నా కవిత వలన ఆయన ఎలా టార్గెట్ అయ్యారు అంటూ ప్రశ్నించారు. సోషల్ మీడియాలో సంస్కారం లేకుండా కామెంట్లు పెట్టవద్దు అని హితవు పలికారు.


Click it and Unblock the Notifications











