twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి భర్త దొరికితే డబుల్ ధమాకా: ఇది రేణు దేశాయ్ మాట

    |

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 'ఎ లవ్‌, అన్‌ కండీషనల్‌' అనే కవితల పుస్తకం రాశారు. దీన్నితెలుగులో అనంత శ్రీరామ్ చేత అనువాదం చేయించి విడుదల చేశారు. బుక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె పలు తెలుగు టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

    ఈ పుస్తకంలో రాసి ఉన్న... ''నన్నేమీ నువ్వు పూర్తి మనిషిగా చేయాల్సిన అవసరం లేదు... నేను ఇప్పటికే ఒక సంపూర్ణమైన వ్యక్తిని, వంకర్లు తిరిగిన వలయాన్ని కాదు'' అనే లైన్స్ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది ఎవరిని ఉద్దేశించిన రాసింది అని మీడియా వారు ప్రశ్నించగా రేణు దేశాయ్ వివరణ ఇచ్చారు.

    యంగ్ గర్ల్స్‌ను ఉద్దేశించి రాసిందే...

    యంగ్ గర్ల్స్‌ను ఉద్దేశించి రాసిందే...

    ఈ లైన్స్ నేను యంగ్ గర్ల్స్‌ను ఉద్దేశించి రాశాను. చాలా మంది అమ్మాయిలు తాము సంపూర్ణం కాదని, తమ జీవితంలోకి మంచి అబ్బాయి వస్తేనే సంపూర్ణం అవుతామని భావిస్తారు. మనకు చిన్నప్పటి నుంచి ప్రిన్స్ చార్మింగ్ కమింగ్ ఆన్ ది వైట్ హార్స్, సోల్ మేట్ అని నేర్పిస్తారు. ఒక అబ్బాయి మన జీవితంలోకి వస్తేనే అమ్మాయిగా నేను కంప్లీట్ అవుతాను అనే ఫీలింగ్ ఉండకూడదనే చెప్పడంలో భాగంగానే అలా రాశాను అని రేణు దేశాయ్ తెలిపారు.

    మంచి భర్త దొరికితే డబల్ ధమాకా

    మంచి భర్త దొరికితే డబల్ ధమాకా

    ఏ అమ్మాయి అయినా నీకు నువ్వు కంప్లీట్ అని ఫీలవ్వాలి. ఒక వేళ నీకు మంచి జీవిత భాగస్వామి దొరికితే... అది డబుల్ ధమాకా. పెళ్లి తర్వాతనే సంతోషం ఉంటుంది, నా జీవితం కంప్లీట్ అవుతుందనే భావనతో ఉండకూడదు. ఎవరి తోడు లేకున్నా మీరు మీలో కంప్లీట్ అని ఫీలవ్వాలి... అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చారు.

    5 నిమిషాల్లోనే రాసిన రేణు

    5 నిమిషాల్లోనే రాసిన రేణు

    ఈ కవితల పుస్తకం రాసే వరకు నాలో ఇంత డెప్త్ ఉండదనే విషయం నాకు కూడా తెలియదు. కానీ ఐదు నిమిషాల్లో దీన్ని రాశాను. నా పోయెమ్స్ అన్నీ కూడా దాదాపు 5 నిమిషాల్లో రాసినవేనని రేణు దేశాయ్ అన్నారు.

    రేణు దేశాయ్ చెప్పాలనుకుంది ఇదేనా?

    రేణు దేశాయ్ చెప్పాలనుకుంది ఇదేనా?

    ఒక అమ్మాయి తన జీవితంలో అబ్బాయి ఉన్నా, లేక పోయినా సంతోషంగా ఉండాలి. వాళ్లు వచ్చి మనల్ని ఉద్దరిస్తారని, మన జీవితాన్ని సంతోషంగా మారుస్తారని ఎదురు చూడకూడదు, ఒక వేళ మంచి భర్త వస్తే మన జీవితం మరింత సంతోషంగా ఉంటుంది. అంతే కానీ అబ్బాయి లేకుండా సంతోషం ఉండదనే భావనలో ఉండకూడదని... రేణు దేశాయ్ చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

    English summary
    Renu Desai Good Message to Young girls. She suggested that girls should be happy even if no boys in their life. Renu Desai Says that her life is a open book.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X