విమర్శ: రేణు దేశాయ్ ట్వీట్ సంచలనం
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి...గత ఎన్నికల్లో బిజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన బీజేపీ మద్దతు దారుడే. అయితే ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ మహారాష్ట్రలో బిజేపీ రాజకీయాలను ఎత్తి పొడుస్తూ చేసిన ట్వీట్ ఇపుడు సంచలనం సృష్టిస్తోంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సెప్టెంబర్ 26న చేసిన ట్వీట్‌ను ఆమె తాజాగా గుర్తుచేసారు. అవినీతి ఎన్సీపీతో తాము ఎప్పటికీ పొత్తు పెట్టుకోబోమని అప్పట్లో ఫడ్నవీస్ ట్వీట్ చేసారు. అయితే రెండు రోజుల కింద జరిగిన బల పరీక్షలో బీజేపీ, ఎన్సీపీ పొత్తు పెట్టుకున్న సంఘటనను, గతంలో ఫడ్నవీస్ చేసిన ట్వీట్ ఆమె ఎత్తి చూపారు. ఆమె ట్వీట్ బట్టి బీజేపీపై రేణుదేశాయ్ విమర్శలు చేసారని అర్థం చేసుకోవచ్చు.

ఇక రేణు దేశాయ్ తాజా సినిమా విషయానికొస్తే...
ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ఇష్క్ వాలా లవ్' చిత్రాన్ని తెరకెంచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబర్ 10 విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసిన రేణు దేశాయ్, ఆ తర్వాత అక్టోబర్ 17 కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు కూడా విడుదల సాధ్యంకాలేదు. తర్వాత అక్టోబర్ 24న అనుకున్నప్పటికీ సాధ్యమయ్యే పరిస్థితి కనిపించక పోవడంతో.....రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అంటూ చెబుతూ కాలం వెల్లదీస్తోంది.
అయితే సినిమా వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అకీరా నటించిన తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఇష్క్ వాలా లవ్' ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











