పవన్ కల్యాణ్‌కు నేను భార్యను ఎప్పటికీ కాలేను.. రేణు దేశాయ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బంధంపై ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది. విడాకుల తర్వాత మళ్లీ కలువాలని ఫ్యాన్స్ చేసిన రిక్వెస్ట్‌లను ఆమె సున్నితంగా తోసిపుచ్చింది.

By Rajababu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో బంధంపై ఆయన మాజీ భార్య రేణుదేశాయ్ పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చింది. విడాకుల తర్వాత మళ్లీ కలువాలని ఫ్యాన్స్ చేసిన రిక్వెస్ట్‌లను ఆమె సున్నితంగా తోసిపుచ్చింది. తనకు పవన్ ప్రస్తుతం మంచి మిత్రుడని, తనతో వైవాహిక బంధం మళ్లీ చిగురించిందని ఆమె స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తమపై కురిపిస్తున్న అభిమానానికి ధన్యురాలిని అని సంతోషాన్ని వ్యక్తం చేసింది. గత కొద్దికాలంగా పవన్ నుంచి విడిపోయి దూరంగా ఉంటున్న రేణుదేశాయ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై స్పందించినట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. ఇంతకీ అభిమానులకు ఆమె చేసిన రిక్వెస్ట్ ఏమిటంటే..

అందుకే ఈ పోస్ట్ పెడుతున్నాను..

అందుకే ఈ పోస్ట్ పెడుతున్నాను..

నాలుగేళ్లుగా ఫేస్‌బుక్, ట్విటర్‌ లాంటి సోషల్‌ మీడియాలో నా వ్యక్తిగత జీవితానికి సంబంధించి వరుసగా అభ్యర్థనలు, విన్నపాలు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉన్నాయి. నేను నా ఇంటర్వ్యూల్లో, సోషల్‌ మీడియాలో ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ఇవి ఆగడం లేదు. అందుకే మరోసారి చాలా స్పష్టంగా నా అభిప్రాయాన్ని చెప్పడానికి క్రింది పోస్ట్‌ పెడుతున్నాను అని రేణుదేశాయ్ పేర్కొన్నారు.

ఆన్నాను పెళ్లి చేసుకొన్నారు..

ఆన్నాను పెళ్లి చేసుకొన్నారు..

‘మిత్రులకు, నా శ్రేయోభిలాషులందరికీ నమస్కారం... మీరు నిరంతరం నా పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలకు, నాకు అందిస్తున్న సహాయ సహకారాలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా వ్యక్తిగత జీవితం గురించి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. కల్యాణ్‌గారు నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆనా'ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక చక్కటి కూతురు కూడా ఉంది అని వివరించారు రేణుదేశాయ్

విన్నపం ఒకటే..

విన్నపం ఒకటే..


పవన్ కల్యాణ్ వివాహ బంధాన్ని, ఆయన కుమార్తెకు జన్మనిచ్చిన తల్లిని గౌరవిస్తూ నేను మీకు చేసుకునే విన్నపం ఒక్కటే. నేను, కల్యాణ్‌గారు తిరిగి ఏకం కావాలని మీరు పదేపదే కోరుకోవద్దు. దయచేసి మీరు ఒక విషయం అర్థం చేసుకుని ఆమోదించాలి. అదేంటంటే కల్యాణ్‌గారి భార్య అన్నా లెజోనోవా... నేను కాదు.ఒకటి మాత్రం నిజం. ఆయన నా పిల్లలకు తండ్రి. నేనూ ఆయన మంచి స్నేహితులం మాత్రమే. కానీ మేమెప్పటికీ తిరిగి భార్యాభర్తలం కాలేము. ఈ సత్యాన్ని నేను మనసా, వాచా, కర్మణా అంగీకరిస్తున్నాను అని వెల్లడించింది.

వాస్తవాన్ని అర్థం చేసుకొంటారనుకుంటా..

వాస్తవాన్ని అర్థం చేసుకొంటారనుకుంటా..

మీరు కూడా ఈ వాస్తవాన్ని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నన్ను తిరిగి కల్యాణ్‌గారి దగ్గరకు వెళ్లమని మాటిమాటికీ మీరు కోరడం సబబు కాదని గుర్తించాల్సిందిగా మనవి చేస్తున్నాను. మరో వైవాహిక బంధంలో ఉన్న ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళడం అసమంజసం, అసాధ్యం, అర్థరహితం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భవిష్యత్‌లో ఈ విషయమై ఎలాంటి ఇబ్బందులు కలిగించే ఒత్తిడితో కూడిన కోరికలేవీ మీ వద్ద నుంచి ఎదురు కావని ఆశిస్తున్నాను. ఎంతో నిజాయితీగా, మనస్ఫూర్తిగా మీకు నేను చేసిన ఈ విన్నపాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని, ఎప్పటిలా మీ నిర్మలమైన స్నేహ వాత్సల్యాలను అందిస్తారని కోరుకుంటూ...

మీ నిర్ణయాన్ని గౌరవిస్తా..

ఫేస్‌బుక్‌'లో రేణూ దేశాయ్‌ ఇది పోస్ట్‌ చేసిన తర్వాత ‘మీరెంతైనా మా అన్న వైఫ్‌ కాబట్టి, మీ ఇద్దరూ కలవాలని కోరుకుంటాం. మిమ్మల్ని ఎప్పటికీ మా ‘వదిన'లానే భావిస్తాం' అంటూ కొందరు కామెంట్స్‌ పోస్ట్‌ చేయడం విశేషం. అలాగే, ‘మీ పోస్ట్‌లో మీ బాధ తెలుస్తోంది' అని మరికొందరు, ‘మీ నిర్ణయాన్ని గౌరవిస్తాం' అని ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X