twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సునీత పెళ్లిలో రేణూ దేశాయ్.. కరోనా అంటూ గందరగోళం.. అందుకే ఆ ఆగ్రహమట!!

    |

    రేణూ దేశాయ్ తనపై వచ్చిన తప్పుడు వార్తలను, ఆ వార్తలను రాసిన వెబ్ సైట్‌ను ఏకిపారేసింది. మునెప్పుడూ చూడనటు వంటి ఆగ్రహం, పరుషమైన పదజాలంతో రేణూ దేశాయ్ విరుచుకుపడింది. దానికి చాలానే కారణాలున్నాయి. అసలే కరోనా అంటే అందరూ భయపడిపోతోన్న తరుణంలో ఇలా తప్పుడు వార్తలు రాయడం ఒకటైతే... ప్రస్తుతం సునీత పెళ్లిలో తాను ఉండగా ఇలాంటి ఫేక్ వార్తలు రావడం మరింత ఆగ్రహానికి గురయ్యాలే చేసినట్టున్నాయి. అందుకే ఈ మేరకు క్లారిటీ ఇస్తూ పోస్ట్‌లు చేసింది.

    Recommended Video

    Renu Desai refutes rumours of Testing Positive for Coronavirus | Filmibeat Telugu
    స్టుపిడ్ వెబ్ సైట్ అంటూ..

    స్టుపిడ్ వెబ్ సైట్ అంటూ..

    తనకు కరోనా పాజిటివ్ వచ్చిందంటూ తప్పుడు వార్తలు రాసిన వెబ్ సైట్‌పై రేణూ దేశాయ్ తీవ్ర స్థాయిలో మండిపడింది. స్టుపిడ్ వెబ్ సైట్స్, వాటి ట్విట్టర్ హ్యాండిల్స్ ఫాలో అవ్వడం ఆపేయండి.. ఇదే నా సిన్సియర్ రిక్వెస్ట్..ఇలాంటి స్టుపిడ్స్ కేవలం అబద్దాలు, తప్పుడు వార్తల మీదే బతుకుతుంటారంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.

    ఓ ఫంక్షన్‌లో ఉన్నా..

    ఓ ఫంక్షన్‌లో ఉన్నా..

    ఆ ఫేక్ వార్త వల్ల.. పది నిమిషాల వ్యవధిలోనే నాకు మూడు కాల్స్ వచ్చాయట.. నేను నిన్న ఓ ఫంక్షన్‌లో ఉన్నాను.. అలా వచ్చిన రూమర్ ఎంతటి గందరగోళాన్ని అక్కడ క్రియేట్ చేస్తుంది.. నా బాధ్యతారాహిత్యంపై ఎలాంటి ఇమేజ్ ఏర్పడుతుంది.. అందుకే అలా నేను స్పందించాల్సి వచ్చిందంటూ రేణూ దేశాయ్ క్లారిటీ ఇచ్చింది.

     పాజిటివ్ వస్తే..

    పాజిటివ్ వస్తే..

    ఓ ఫంక్షన్ అని చెప్పింది కానీ అది ఏ ఫంక్షన్ అని క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆమె సోషల్ మీడియా ఖాతాను పరిశీలిస్తే అది సునీత పెళ్లి వేడుక అని తెలిసిపోతోంది. అయితే ఇలా రూమర్లు రావడంపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. ఒక వేళ నాకు పాజిటివ్ అని రిపోర్ట్ వస్తే.. అది నేను చెబుతాను.. ఇలాంటి ఫంక్షన్లకు కూడా రాను.. తప్పుడు వార్తలు రాసే వారు..కాస్త చెక్ చేసుకోండని సూచించింది.

    అలా చెప్పడం తప్పు..

    అలా చెప్పడం తప్పు..

    కరోనా పాజిటివ్ వచ్చిందని వార్తలు రాయడం అదేమీ సరదా విషయం కాదు.. జనాలు చచ్చిపోతున్నారు.. ఇదే సినిమాలకు సంబంధించిన గాసిప్ రూమర్లు కావు.. కానీ కొందరు మాత్రం ఇలాంటి వాళ్లను వదిలేయమని నాకు సలహాలు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు.. కరోనా అనేది సీరియస్ టాపిక్.. ఇలా తప్పుడు వార్తలు రాసే ఊరుకోలేను అందుకే ఇలా రియాక్ట్ అయ్యానంటూ రేణూ దేశాయ్ అసలు విషయం చెప్పేసింది.

    English summary
    Renu Desai In Singer Sunitha Marriage And Fires On Fake news About Corona
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X