»   »  విసుగెత్తి రేణు దేశాయి...పవన్ ఫ్యాన్స్ కి సూటి ప్రశ్న

విసుగెత్తి రేణు దేశాయి...పవన్ ఫ్యాన్స్ కి సూటి ప్రశ్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి ఇప్పుడు మరాఠీలో విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్నారు. ఆమె ఈ మధ్యనే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లోకి వచ్చి ఏక్టివ్ గా ఉంటున్నారు. తన మాజీ భర్త పవన్ కల్యాణ్ గురించి ఆమె తన మనస్సులోని అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొన్ని ఎవరికీ తెలియని విషయాలను సైతం ఆమె గుర్తు చేసుకుంటున్నారు. అయితే కొందరు పవన్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆమెను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడవద్దంటూ కామెంట్ చేయటం ఆమెను చిరాకు తెప్పిస్తోంది. ఈ విషయమై ఆమె ఆవేదనతో పోస్ట్ చేసారు.

"ఓకే...నేను ఎందుకు హఠాత్తుగా మాట్లాడుతున్నాను అనే గురించి చెప్తున్నాను....నేను గత నాలుగు సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్నాను, అందరూ నేను మాట్లాడాలని, సైలెంట్ గా ఉండటం పద్దతి కాదన్నారు. దాంతో ఇప్పుడు నా శ్రేయాభిలాషులు, అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూంటే ఎందుకు హఠాత్తుగా మాట్లాడుతున్నావు అని ఆశ్చర్యపోతున్నారు. నేను సైలెంట్ గా ఉన్నా సమస్య. నేను మాట్లాడినా సమస్యే...నేను రాజకీయాలకు సంభంధం లేని కొన్ని నా ఆలోచనలు పంచుకోవటం స్వార్ధం అవుతుంది ..?," అంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు.

 Renu Desai irked with Powerstar's fans

పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా సహ జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

రేణు దేశాయ్ నిర్మాతగా మారి 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.

English summary

 Renu Desai questioned "I was silent for 4yrs, everyone complained i was silent and wanted me to be vocal.now im interacting with my well wishers and fans everyone is wondering why suddenly im so vocal. This is the problem of the world...im silent that a problem...i speak thats a problem.seriously how does it make me 'selfish' if i post some personal non political thoughts of mine...?," .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu