»   » రేణుదేశాయ్ ..అసూయ పడే పవన్‌ ఫొటో ఇదే!!

రేణుదేశాయ్ ..అసూయ పడే పవన్‌ ఫొటో ఇదే!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ అతనితో విడిపోయిన తర్వాత పూణెలో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రేణు దేశాయ్ తన ట్విట్టర్ పేజీలో పవన్ కళ్యాణ్ గురించి పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది.

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ను ఆయన మాజీ భార్య రేణూదేశాయ్‌ మళ్లీ ట్విట్టర్‌ ద్వారా గుర్తుచేసుకున్నారు. గతంలో ఆమె తీసిన పవన్‌ ఫొటోను రేణు తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అందులో ఆయన ఓ కనుబొమ్మనిపైకి పెట్టుకుని పోజు ఇస్తున్నారని, చక్కగా ఉన్న పవన్‌ మేనిరంగు చూస్తే ఎప్పుడూ అసూయగా ఉంటుందని ట్వీట్‌ చేశారు.

ఈ ఫొటోను తాను ఎడిట్‌ చేయలేదని, ఆ రంగు నిజమేనన్నారు. కళ్యాణ్‌ యోగా, డైట్‌ చేయడం వల్లే ఆయన స్కిన్‌ అంత ప్రకాశమంతంగా ఉంటుందని రేణూ చెప్పుకొచ్చారు.

కొందరు పవన్ కళ్యాణ్ అభిమానుల కోరిక మేరకు... తాను స్వయంగా తీసిన పవన్ కళ్యాణ్ ఫేవరెట్ ఫోటోలును పోస్టు చేస్తున్నారు. 2010లో తాను కొత్తగా కొన్న కానన్ 5డి కెమెరాతో ఈ ఫోటో తీసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఫోటో పోస్టు చేయడం పాటు ఆ ఫోటోలో తనకు ఇష్టమైన అంశాలను వర్ణించారు.

ఇంతకు ముందు కూడ ఓ ఫొటోను పోస్ట్ చేసి...'ఐ లవ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ హిస్ ఐస్/లుక్ ఇన్ దిస్, హున్స్ ఇట్ ఈజ్ మై ఫేవరెట్, ఆల్సో ది స్కిన్ టోన్ ఈజ్ ఒరిజినల్ & నాట్ ఎడిటెడ్ బై మి' అంటూ పోస్టు చేసారు.

ప్రేమ వివాహం చేసుకున్న పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రేణుదేశాయ్‌లు విడిపోయి చాలా కాలమే అయ్యింది. అయినప్పటికీ రేణు ట్విట్టర్‌ ద్వారా సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌ గురించి మాట్లాడుతుంటారు.

English summary
Pawan Kalyan's former wife Renu Desai said that: Pawan was doing the "one eyebrow up" look, I was always jealous of his awesome skin texture. The tones are all original. Kalyangaru always had very good skin quality because of his yoga & healthy diet.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu