సడెన్‌గా కర్నూల్‌లో రేణు దేశాయ్ ప్రత్యక్షం.. పవన్ కళ్యాణ్ కూడా అదే జిల్లాలో.. దేనికోసమంటే!

పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ మరోమారు సెన్సేషన్ గా మారారు. రేణు దేశాయ్ కర్నూల్ పర్యటన హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయాక రేణు దేశాయ్ పుణేలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. దర్శకురాలిగా, రచయితగా రేణు దేశాయ్ పలు చిత్రాలు చేస్తున్నారు. ఆమె టాలీవుడ్ లోకి నటిగా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు కూడా వార్తలు జోరందుకుంటున్నాయి. ఈ తరుణంలో రేణుదేశాయ్ సడెన్ గా కర్నూల్ జిల్లాలో పర్యటించిన అందరికి దృష్టిని ఆకర్షించారు.

రైతు సమ్యసలపై చిత్రం

రైతు సమ్యసలపై చిత్రం

రైతుల సమస్యల నేపథ్యంలో తాను ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు రేణు దేశాయ్ ఆ మధ్యన ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కోసం తాను ముందుగా రైతుల సమస్యలని అధ్యయనం చేస్తానని కూడా రేణు దేశాయ్ ప్రకటించారు. అందుకు తగ్గట్లుగా రేణు దేశాయ్ రంగంలోకి దిగిపోయారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో రేణు దేశాయ్ సోమవారం పర్యటిస్తున్నారు.

 ఆ కుటుంబాలకు పరామర్శ

ఆ కుటుంబాలకు పరామర్శ

గత ఏడాది కర్నూలు జిల్లాలో ఆలూరు మండలంలో రెండు కుటుంబాలకు చెందిన రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేణు దేశాయ్ వారి కుటుంబాలని పరామర్శించనున్నారు. రేణు దేశాయ్ పర్యటనకు పోలీలులు కూడా భారీ భదత్ర కల్పిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఆమె స్వయంగా ప్రజలతోమమేకం అవుతున్నారు. రేణు దేశాయ్ సడెన్ గా ఈ కార్యక్రమంలో పాల్గొంటుండడంతో సహజంగానే అనేక ఊహాగానాలు మొదలవుతున్నాయి.

పవన్ కళ్యాణ్ కూడా అక్కడే

పవన్ కళ్యాణ్ కూడా అక్కడే

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం కర్నూల్ జిల్లా పర్యటనలోనే ఉన్నారు. రేణు దేశాయ్ కూడా అదే జిల్లాలో పర్యటించి ప్రజలతో మమేకం అవుతుండడంతో సినీరాజకీయ వార్తల్లో హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఇటీవల మూడు రోజుల పర్యటన నిమిత్తం కర్నూలు జిల్లాకు వెళ్లిన సంగతి తెలిసిందే.

కీలక పాత్రలో

కీలక పాత్రలో

రేణు దేశాయ్ నటిగా టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్ నటించబోతున్న టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ చిత్రంలో రేణు దేశాయ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇష్క్ వాలా లవ్ చిత్రంతో దర్శకురాలిగా మారిన రేణు దేశాయ్ త్వరలో రైతుల సమస్యలపై ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X