»   » పవన్ కొడుకు, కూతురు పేరుతో బ్యానర్స్ (ఫొటోలు)

పవన్ కొడుకు, కూతురు పేరుతో బ్యానర్స్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవన్ కళ్యాణ్, రేణు దేశాయి ల కుమారుడు అకిరా నందన్. తనకు ఇష్టమైన జపాన్ దర్శకుడు అకిరా కురుసోవా పేరుతో తన కుమారుడుకి అకిరా అనే పెట్టుకున్నారు. ఇప్పుడు అదే అకిరా ఫిల్మ్స్ పేరుతో బ్యానర్ ఓపెన్ చేసింది రేణు దేశాయి. ఈ బ్యానర్ పై ఆమె మరాఠీలో సినిమాలో నిర్మించనుంది. ఈ బ్యానర్ పై Ishq Wala Love అనే చిత్రం ఆమె నిర్మిస్తోంది. అలాగే తమ కుమార్తె ఆద్య పేరున కూడా ఆమె ఓ బ్యానర్ ప్రారంభించి, సినిమాలు మొదలెడుతోంది.

వన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు బ్రతుకుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఇక్కడ సినిమాలు,రాజకీయాలు అంటూ బిజీగా ఉంటే... రేణు తన పిల్లలతో కలిసి పూనేలో ఉంటున్నారు. అక్కడ ఆమె మరాఠి చిత్రాలు నిర్మాణంలో బిజీ అయ్యారు. అయితే పవన్ మీద ఆమెకు ప్రేమ, అభిమానం తగ్గలేదు. అందుకే ఆమె తాజాగా ట్విట్టర్ లో జాయిన్ అయ్యింది. ఆయనకు సపోర్ట్ చేయటానికే ట్విట్స్ ఉండబోతున్నాయని తెలుస్తోంది.

ఇక రీసెంట్ గా... రేణూ దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. చాలా వాస్తవ దృక్పథం కలిగిన వ్యక్తి అని, మానవత్వం కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ దాదాపు తొలిసారి స్పందించారు. ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ పైన బహిరంగంగా స్పందిస్తున్నానని చెప్పారు. పవన్‌కు కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి అని, ఆయన హృదయం నిష్కళంకమైనదని చెప్పారు. పవన్‌లాంటి వాళ్లు కావాలి, మాకే తెలుసు: రేణు దేశాయ్ తామిద్దరు జీవితంలో ఏం జరిగిందో తమకు మాత్రమే తెలుసునని చెప్పారు.

Renu Desai Names Her Banner After HIM

తమ ఇద్దరి జీవితంలో ఏం జరిగిందో ఇతరులెవరికీ తెలియదన్నారు. తామిద్దరి జీవితంపై కామెంట్ చేసే అర్హత ఈ ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు. సొసైటీకి ఏదో చేయాలని మనస్ఫూర్తిగా, నిజాయితీగా తపించే పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవమని, ఆయనను తాను ఆరాధిస్తానని రేణు దేశాయ్ అన్నారు. తాను అప్పుడు.. ఇప్పుడు... ఎప్పుడు.. పవన్‌కు మద్దతుగా ఉంటానని చెప్పారు. తాను పవన్‌కు ఎప్పుడు అండగా నిలబడ్డానని, ఇక ముందు మద్దతుగా ఉంటానన్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ప్రపంచానికి అవసరమన్నారు.

రేణు దేశాయ్ నిర్మాతగా మారి 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.

English summary

 Renu Desai is getting ready to come up with her next flick. This time, she wanted to come up with an interesting name for her production banne 'Akira Films'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu