»   » సూర్య‌తో రేణు దేశాయ్ న్యూ ఇయర్ లంచ్ (ఫోటోస్)

సూర్య‌తో రేణు దేశాయ్ న్యూ ఇయర్ లంచ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకలను పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ తన పిల్లు అకీరా, ఆద్యాలతో కలిసి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. దర్శకుడు ఎస్.జె.సూర్యతో కలిసి న్యూ ఇయర్ లంచ్ చేసారు. ఈ సందర్భంగా సూర్యతో కలిసి దిగిన ఫోటోను ఆమె న్యూ పోస్టు చేసారు. ఈ ఫోటో తీసింది తన కుమారుడు అకీరా అని ఆమె పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ చాలా కాలం క్రితమే విడిపోయినా.... ఇద్దరి మధ్య స్నేహ బంధం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ అభిమానులు తీరు నచ్చక పోవడం, తాను ఏ కామెంట్ చేసినా వారు మరో మరో రకంగా అర్థం చేసుకోవడం లాంటి పరిణామాలతో రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఆలోచించడం మానేసిందని, పవన్ గురించి ఆలోచనలకు కూడా దూరంగా ఉంటోందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అప్పుప్పుడు రేణు దేశాయ్ వద్దకు వచ్చి పిల్లలను కలిసి వెలుతున్నారు.

మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్.

Renu Desai New year lunch with Surya

‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు. ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడక తప్పలేదు. సింపుల్‌గా వీరి పెళ్లి తంతు జరిగింది.

నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు. తర్వాత ఆయనతో విడిపోయారు. పవన్ కళ్యాణ్ ద్వారా అకీరా, ఆద్యా అనే ఇద్దరు పిల్లకు తల్లయింది. ప్రస్తుతం మరాఠీ సినీ పరిశ్రమలో తన నిర్మాతగా, దర్శకురాలిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది రేణు దేశాయ్.

English summary
"New year lunch with Surya sir...:) pic clicked by Akira &Aadya hiding behind me" Renu Desai tweeted.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu