నేను ఒప్పుకోలేదు.. అయినా చేయించారు, పవన్ కళ్యాణ్ గారే సాక్ష్యం.. రేణు దేశాయ్!

Recommended Video

Renu Desai Reveals Interesting Facts About Her Life In Ali Show || Filmibeat Telugu

ప్రస్తుతం రేణుదేశాయ్ కి సంబంధించిన విషయాలు మీడియాలో హాట్ టాపిక్. రేణు దేశాయ్ ఏం మాట్లాడినా ఆ విషయాలు వైరల్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ పుణేలో నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల రేణు దేశాయ్ అలీతో సరదాగా అనే కార్యక్రమంలో పాల్గొంది. ఈ ప్రోగ్రాంలో రేణు దేశాయ్ అలీతో అనేక ఆసక్తిక్రమైన సంగతులని పంచుకుంది. తెలుగులో నటించే అవకాశం ఎలా వచ్చింది, పవన్ కళ్యాణ్ తో పరిచయం లాంటి సంగతులని రేణు దేశాయ్ ప్రస్తావించింది.

మోడలింగ్‌లో ఫోటో చూసి

మోడలింగ్‌లో ఫోటో చూసి

రేణు దేశాయ్ మాట్లాడుతూ తనకు బద్రి చిత్రాల్లో అవకాశం ఎలా వచ్చిందో అనే విషయాన్ని వివరించారు. తాను మోడల్ గా రాణిస్తున్న సమయంలో పూరి జగన్నాథ్ నా ఫోటో చూశారు. బద్రి చిత్రం ప్రారంభించడానికి ముందు నా ఫోన్ నంబర్ కనుక్కుని ముంబైలో కలిశారు. ఇలా బద్రి చిత్రంలో హీరోయిన్ రోల్ ఉందని చెప్పారు. ఆ సమయంలో నాకు నటించడం అసలు ఇష్టం లేదు. నేను చేయలేను సర్.. హీరోయిన్ గా నేను కరెక్ట్ కాదు అని చెప్పేశా. కానీ మంచి అవకాశం అంటూ నన్ను కన్విన్స్ చేశారు అని రేణు తెలిపారు.

ఆ పేరే వినలేదు

ఆ పేరే వినలేదు

ఈ చిత్రంలో హీరో ఎవరు అని అడిగాను. ఆ సమయంలో నేను పవన్ కళ్యాణ్ అనే పేరే వినలేదు. అప్పట్లో ఇప్పటిలాగా నార్త్ వాళ్లకు సౌత్ హీరోలు పెద్దగా తెలియదు. రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్ లాంటి పేర్లు మాత్రమే విన్నా. పవన్ కళ్యాణ్ ఎవరో తెలియదు. ఇలా చిరంజీవి తమ్ముడు.. తొలి ప్రేమ చిత్రంతో స్టార్ అయ్యారు అని చెప్పారు. ఆరు నెలలు షూటింగ్ చేయాలి కాబట్టి హీరోతో నేను ముందుగా మాట్లాడాలి అని అడిగాను. అలా పవన్ కళ్యాణ్ గారిని తొలిసారి రామనాయడుడు స్టూడియోలో కలిశాను అని రేణు దేశాయ్ తెలిపారు.

 రాజకీయాల్లోకి

రాజకీయాల్లోకి

ఇక రైతుల సమస్యల గురించి తాను తెలుసుకుంటుంటే అనవసరంగా రాజకీయాలతో ముడిపెడుతున్నారు అని అన్నారు. నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. చిన్నప్పటి నుంచి నాకు వ్యవసాయం అంటే ఇష్టం. అందుకే రైతుల సమస్యలు తీసుకుంటున్నానని రేణు దేశాయ్ తెలిపారు. ఇటీవల తాను ఆంధ్రప్రదేశ్ లో రైతులతో సమావేశమైనప్పుడు కూడా అనవసరమైన కామెంట్స్ చేశారని రేణు తెలిపారు.

 ఫ్యామిలీ వ్యక్తిలాగా

ఫ్యామిలీ వ్యక్తిలాగా

రేణు దేశాయ్ తో మాట్లాడుతూ అలీ ఆమెని ఓ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. సినిమాల్లో కాకుండా బయట నా గురించి మీ ఒపీనియన్ ఏంటని అలీ అడిగారు. నా మాజీ భర్త పవన్ కళ్యాణ్ గారితో మీకున్న రిలేషన్ వలన చూడగానే కుటుంబ సభ్యుడనే ఫీలింగ్ కలుగుతుందని రేణు దేశాయ్ తెలిపింది. నా దగ్గర కనీసం మీ ఫోన్ నంబర్ కూడా లేదు. కానీ మిమ్మల్ని చూసినప్పుడల్లా నా కుటుంబ సభ్యుడే కదా అని అనిపిస్తుందని రేణు తెలిపారు.

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు

తాను సినిమాకు సంబంధించి కేవలం ఆర్ట్ డైరెక్షన్ మాత్రం ఇంతవరకు చేయలేదని.. మిగిలిన అన్ని విభాగాల్లో తనకు పట్టు ఉందని రేణు తెలిపారు. ఖుషి, జానీ, అన్నవరం, బాలు లాంటి చిత్రాలన్నింటికీ ఎడిటర్ గా పనిచేశానని తెలిపారు. కానీ ఆ చిత్రాలకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని రేణు తెలిపారు. నిజమా అని అలీ ఆశ్చర్యపోయి అడగగా.. దీనికి పవన్ కళ్యాణ్ గారు, ఏఎం రత్నంగారు సాక్ష్యం అని రేణు దేశాయ్ తెలిపింది.

అకీరాని ఏం చేయాలని

అకీరాని ఏం చేయాలని

అకీరాని భవిష్యత్తులో ఏం చేయాలని అనుకుంటున్నారు అని అలీ అడగగా రేణు దేశాయ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. అకీరాకు ప్రతి సంవత్సరం తన లక్ష్యం మారిపోతూ ఉంటుంది. ఓ సంవత్సరం క్రికెటర్ కావాలని అంటాడు. మరో ఏడాది మ్యూజిక్ నేర్చుకోవాలని అంటాడు. తనకు స్వయంగా నిర్ణయం తీసుకోగలిగే వయసు వచ్చి ఈ వృత్తిని ఎంచుకుంటాను అంటే అందుకు ఓకే చెబుతాను అని రేణు దేశాయ్ అన్నారు. కానీ ఇప్పుడు మాత్రం తాను పూర్తిగా చదువు పైనే దృష్టి పెట్టాలని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X