రెండో పెళ్లిపై పవన్ ఓ మాట చెప్పారు.. ఆ మాట విని గుండె పగిలింది.. రేణు దేశాయ్

By Rajababu

Recommended Video

రేణు రెండో పెళ్లిపై పవన్..!!

పవర్ స్టార్ మాజీ భార్యగా రేణు దేశాయ్ అందరికీ సుపరిచితులు. పవన్ నుంచి విడిపోయిన తర్వాత ఈ మధ్య టెలివిజన్ యాంకర్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. పవన్‌తో విడాకులు, రేణు దేశాయ్ రెండో పెళ్లి గురించి మీడియాలో పెద్ద చర్చ జరుగుతున్నది. రేణు రెండో పెళ్లి గురించి పవన్ ఫ్యాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రేణు దేశాయ్ ప్రముఖ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. పలు విషయాలను వెల్లడించారు. రేణు దేశాయ్ వెల్లడించిన విషయాలు ఆమె మాటల్లోనే..

నీకు పెళ్లి అవసరమా?

నీకు పెళ్లి అవసరమా?

పవన్ కల్యాణ్‌తో విడిపోయిన తర్వాత నీకు మళ్లీ పెళ్లి అవసరమా అని ప్రశ్నించిన వాళ్లు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు వారిని చూసుకోవచ్చుగా అని సూటిపోటి మాటలు అన్నారు. ఓ ఫ్యామిలీ ఉంటే బాగుండని నా పిల్లలు అనుకొంటారు. అఖీరా చాలా పరిణితి చెందిన అబ్బాయి.

మమ్మీ పెళ్లి చేసుకో అంటాడు

మమ్మీ పెళ్లి చేసుకో అంటాడు

మమ్మీ పెళ్లి చేసుకో అని అఖీరా అడుగుతుంటాడు. వాళ్ల నాన్నను కూడా నా పిల్లలు అడిగిన దాఖలాలు లేవు. నా ముందైతే ఇప్పటివరకు అడుగలేదు. హైదరాబాద్‌లో ఎన్నడైనా పవన్‌ను అడిగి ఉంటారేమో. అయితే నా పెళ్లి అయితే అందరికి చెప్పి చేసుకొంటాను. నా పెళ్లి ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను.

 మా మధ్య గొడవలు లేవు

మా మధ్య గొడవలు లేవు

పవన్ కల్యాణ్‌కు, నా మధ్య భార్యభర్తల గొడవలు ఎన్నడూలేవు. మేము ఎప్పుడూ గొడవ పడలేదు. మేము గొడవ పడటం నా పిల్లలు చూడలేదు. ఎప్పుడో ఓ సారి బాధతో ఉన్నప్పుడు మాత్రమే నా పిల్లలు చూశారు. వ్యక్తిగతంగా నన్ను పవన్ కల్యాణ్ కోపం చేసిన సంఘటనలు లేవు.

 రెండో వివాహం గురించి పవన్

రెండో వివాహం గురించి పవన్

నా రెండో వివాహం గురించి కూడా పవన్ కల్యాణ్ కొన్ని సూచనలు చేశారు. నేను చేసుకోబోయే వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్ గురించి ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.

 పవన్‌కు కంగ్రాట్స్ చెప్పాను..

పవన్‌కు కంగ్రాట్స్ చెప్పాను..

ఇక పవన్‌కు-అన్నా లెజ్‌నోవా దంపతులకు బాబు పుట్టినప్పుడు.. అంతకుముందు పాప పుట్టినప్పుడు కూడా ఫోన్‌లో మాట్లాడి ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. చిన్న పిల్లలకు ఏం తెలుస్తుంది.. తాను ఎందుకు పుట్టానో.. అందుకే పవన్‌కు బాబు పుట్టిన వెంటనే కంగ్రాట్స్ చెప్పాను.

 పవన్ నుంచి డబ్బు తీసుకోలేదు..

పవన్ నుంచి డబ్బు తీసుకోలేదు..

పవన్ ఫ్యాన్స్ చెప్తున్నట్లు తాను ఎక్కువ మొత్తం తీసుకోలేదు. అమెరికాలో నా సోదరుడిగా భావించే వ్యక్తే డబ్బు కోసం నేను పవన్‌కు దూరమయ్యాను అని అపార్థం చేసుకున్నారు. ఆ తర్వాత నిజం తెలిసి షాక్ అయ్యారు.

 మెయింటెనెన్స్ కూడా అడుగలేదు

మెయింటెనెన్స్ కూడా అడుగలేదు

పవన్‌ కల్యాణ్ విడిపోయిన తర్వాత మెయింటెనెన్స్ కోసం కూడా డబ్బులు అడుగలేదు. పవన్ పేరుతో ఉన్న ఇంటిని అమ్మివేసి డబ్బులను ఇన్వెస్ట్ చేశాను. అవి నా పిల్లల చదువుకు పనికి వస్తున్నది. డబ్బు కోసమే పవన్ నుంచి విడిపోయాను అని అందరూ అంటుంటే గుండె పగిలిపోతుంది.

 ఎలాంటి బాధ లేదు.

ఎలాంటి బాధ లేదు.

పవన్‌తో విడిపోయినందుకు ఎలాంటి బాధ లేదు. జరిగిన దానికి చింతించడం లేదు. నా జీవితంలో జరుగాల్సిందేదో జరిగిపోయింది అనుకొంటాను. దైవ నిర్ణయం అనేది ఉంటుంది అని నమ్ముతాను. నా పిల్లలకు పవన్ కల్యాణ్ తండ్రి అని రాసి పెట్టి ఉంది. అది జరిగింది.

 భార్యభర్తలుగా ఉండలేదు

భార్యభర్తలుగా ఉండలేదు

సాధారణంగా భార్య భర్తల ఉద్యోగాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ పవన్, నా విషయంలో ఒకే ప్రొఫెషనల్‌ ఉండటం వల్లన నేను బాగా అర్థం చేసుకొన్నాను. నేను అర్థం చేసుకొన్నంత ఎవరూ అర్థం చేసుకోలేదనుకుంటా. పవన్ కల్యాణ్‌ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. మేము ఎప్పుడు భార్యభర్తలుగా ఉండలేదు

 ఆ విషయం నా నుంచి రాబట్టలేరు

ఆ విషయం నా నుంచి రాబట్టలేరు

విడాకులు తీసుకోవాలనేది పవన్ కల్యాణ్ నిర్ణయమా అనేది బయటకు చెప్పలేను. ఆ కారణం ఏమిటో మీకు తెలుసు, నాకు తెలుసు. కెమెరా కోసం నా నుంచి విడాకుల విషయాన్ని బయటకు తీసుకురావొద్దు. నేను సైకాలజీ స్టూడెంట్‌ను నా నుంచి ఆ విషయాన్ని నా నుంచి రాబట్టలేరు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X