పవన్ కి గుర్తు చేయటానికేనా రేణు దేశాయి ఈ ఫొటో?
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి తాజాగా ట్విట్టర్ లో ఓ ఫొటోను అప్ లోడ్ చేసింది. అది తన కుమారుడు అకిరా నందన్ తో కలిసి దిగిన ఫొటో. ఆమె తన ఇద్దరు పిల్లలతో కలిసి వేసవి శెలవలను గడపుతోంది. ఈ ఫొటో చూసిన కొందరు ప్రస్తుతం ప్యారెస్ టూర్ లో ఉన్న పవన్ కి తన గత కుటుంబం, పిల్లలు గుర్తు రావటానికే, చేయటానికే ఇలా చేసిందని అంటున్నారు. ప్యారిస్ కి పవన్ తన భార్య(మూడో), బిడ్డతో కలిసి వెళ్ళాడని సమాచారం. ఇక ఆమె ఏ పర్పస్ తో పెట్టిందో లేక సరదాకో ఈ ఫొటోని పోస్ట్ చేసిందో కానీ ఇలా విచిత్రమైన వ్యాఖ్యానాలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో, ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. సెలబ్రెటీల జీవితానికి ఇవన్నీ తప్పవేమో.
పవన్ కళ్యాణ్, రేణు దేశాయి ల కుమారుడు అకిరా నందన్. తనకు ఇష్టమైన జపాన్ దర్శకుడు అకిరా కురుసోవా పేరుతో తన కుమారుడుకి అకిరా అనే పెట్టుకున్నారు. ఇప్పుడు అదే అకిరా ఫిల్మ్స్ పేరుతో బ్యానర్ ఓపెన్ చేసింది రేణు దేశాయి. ఈ బ్యానర్ పై ఆమె మరాఠీలో సినిమాలో నిర్మించనుంది. ఈ బ్యానర్ పై Ishq Wala Love అనే చిత్రం ఆమె నిర్మిస్తోంది. అలాగే తమ కుమార్తె ఆద్య పేరున కూడా ఆమె ఓ బ్యానర్ ప్రారంభించి, సినిమాలు మొదలెడుతోంది.

వన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ఇద్దరూ విడాకులు తీసుకుని ఎవరి జీవితం వారు బ్రతుకుతున్న సంగతి తెలిసిందే. పవన్ ఇక్కడ సినిమాలు,రాజకీయాలు అంటూ బిజీగా ఉంటే... రేణు తన పిల్లలతో కలిసి పూనేలో ఉంటున్నారు. అక్కడ ఆమె మరాఠి చిత్రాలు నిర్మాణంలో బిజీ అయ్యారు. అయితే పవన్ మీద ఆమెకు ప్రేమ, అభిమానం తగ్గలేదు.
ఇక రీసెంట్ గా... రేణూ దేశాయ్ ప్రశంసల జల్లు కురిపించారు. చాలా వాస్తవ దృక్పథం కలిగిన వ్యక్తి అని, మానవత్వం కలిగిన వ్యక్తి అని కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక రేణు దేశాయ్ దాదాపు తొలిసారి స్పందించారు. ఓ టివి ఛానల్ ఇంటర్వ్యూ తర్వాత తాను మొదటిసారి పవన్ కళ్యాణ్ పైన బహిరంగంగా స్పందిస్తున్నానని చెప్పారు. పవన్‌కు కితాబిచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా ఉదారమైన, ఉదాత్తమైన, వినయపూర్వకమైన, నిష్కళంకమైన వ్యక్తి అని, ఆయన హృదయం నిష్కళంకమైనదని చెప్పారు.


Click it and Unblock the Notifications











