twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ భార్య రేణుదేశాయ్ ఉత్కంఠగా..!(ఫోటోలు)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ నిర్మాతగా మారి 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.

    ఇటీవల ఈచిత్రం ప్రీమియర్ షో ముంబైలో జరిగింది. ఈ కార్యక్రమంలో రేణు దేశాయ్ నవ్వుతూ ఎంతో సంతోషంగా కనిపించారు. అయితే రేణు దేశాయ్ పైకి అలా నవ్వుతూ కనిపించినా లోలోన ఎంతో ఉత్కంఠ ఉంటందనేది వాస్తవం. ఎందుకంటే నిర్మాతగా రేణుదేశాయ్ కి ఇదే తొలి సినిమా.

    నిర్మాతగా తొలి ప్రయత్నం కాబట్టి లోలోన ఎంతో కొంత టెన్షన్ ఉండటం సహజమే. అయితే నిర్మాత కాకముందే ఆమె నటి కాబట్టి తన మదిలోని టెన్షన్ బయటకు కనిపించకుండా కవర్ చేసిందనేది పలువురి అభిప్రాయం. స్లైడ్ షోలో 'మంగలాష్ తక్ వన్స్ మోర్' చిత్ర ప్రీమియర్ షో ఫోటోలు.... రేణు దేశాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన విషయాలను మరోసారి గుర్తు చేసుకుందాం.

    రేణు దేశాయ్

    రేణు దేశాయ్


    ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ నిర్మాతగా తన అనుభవాల గురించి, తన భర్త పవన్ కళ్యాన్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

    పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన రేణు దేశాయ్

    పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన రేణు దేశాయ్


    పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్ వైఫ్ నుంచి ఇండి పెడెంట్ నిర్మాతగా ఎలా మారారు? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ.....‘ఈ మార్పు అనేది చాలా స్మూత్‌గా జరిగింది. పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఇండస్ట్రీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. స్క్రిప్టు, స్టోరీ, మ్యూజిక్ సిట్టింగ్స్‌తో ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో ఇన్ వాల్వ్ అయ్యాను. ఇందుకు పవన్‌కు థాంక్స్ చెప్పాలి' అని చెప్పుకొచ్చారు.

    ఆయన నా వెన్నంటే...

    ఆయన నా వెన్నంటే...


    మోడల్ గా కెరీర్ ప్రారంభించారు, నటిగా మారారు, ఇప్పుడు నిర్మాతగా....మీ జర్నీ ఎలా ఉంది? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ...‘మనం ఎవరితోనైనా కలిసి పని చేని చేస్తే అది కాస్త డిఫరెంటుగా ఉంటుంది. వారు మనకు మార్గనిర్దేశం చేయవచ్చు. పవన్ చాలా పెద్ద వ్యక్తి. ఆయన నా వెనక ఉండి అన్ని పరిశీలిస్తారని తెలుసు. నా మార్గంలో నేను దారి తప్పితే ఆయన సరి చేస్తారని తెలుసు.

    ఒంటరిగానే, పవన్ హెల్ప్ తీసుకోవడం లేదు

    ఒంటరిగానే, పవన్ హెల్ప్ తీసుకోవడం లేదు


    కానీ నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాక ఆయన హెల్ప్ లేకుండానే ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాను. అడిగితే ఆయన అన్ని విధాలా అండగా ఉంటారు. కానీ నేను దీన్ని చాలెంజ్ గా తీసుకున్నాను. ఈ దారిలో ఒంటరిగా ప్రయాణించాలని డిసైడ్ అయ్యాను. స్క్రిప్టు ఎంచుకోవడం, ఆర్టిస్టులను కలవడం, మ్యూజిక్ డైరెక్టర్లను కలవడం, ఇలా అన్ని విషయాలు సొంతగా చూసుకుంటున్నాను. నా భార్య మిమ్మల్ని కలవడానికి వస్తుంది...అని పవన్ నన్ను రికమండ్ చేయడు' అని వెల్లడించారు.

    పురుషాధిక్య సినిమా రంగమే, చాలెంజ్‌గా తీసుకున్నా

    పురుషాధిక్య సినిమా రంగమే, చాలెంజ్‌గా తీసుకున్నా


    సినిమా ఇండస్ట్రీ అంటేనే పురుషాధిక్య ప్రపంచం. ఇలాంటి పరిశ్రమలో మీకేమైనా చాలెంజ్ ఎదురైందా? అనే ప్రశ్నకు రేణుదేశాయ్ స్పందిస్తూ...‘సినిమా అంటేనే వ్యాపారం. ఏ రంగంలో అయినా పోటీ సహజమే. కొన్ని సవాళ్లను ఎదుర్కనాల్సి వస్తుంది. నేను పవన్ కళ్యాన్ వైఫ్‌ను కాబట్టి నాతో సినిమాలు చేయడానికి అంతా ముందుకు వస్తారని అనుకోవడం లేదు. పెద్ద పెద్ద యాక్టర్లు నా వ్యూ పాయింట్ ను అర్థం చేసుకుంటున్నారు. నేను సరైన దారిలోనే వెలుతున్నానని అనుకుంటున్నాను' అని వెల్లడించారు.

    పిల్లల పెంపకంలో రాజీపడను

    పిల్లల పెంపకంలో రాజీపడను

    తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూ...నిర్మాతగా కెరీర్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అనే ప్రశ్నకు రేణుదేశాయ్ స్పందిస్తూ ‘కెరీర్‌తో పిల్లల కోసం కూడా సమయం కేటాయించడం నా బాధ్యత. రోజులో కనీసం ఒకసారైనా వారితో కలిసి భోజనం చేస్తాను. తల్లిగా నా బాధ్యతలు నిర్వహించడంలో రాజీపడే ప్రసక్తే లేదు' అని వెల్లడించారు.

    English summary
    Renu Desai is now producing a Marathi film as her mother tongue is Marathi. the titled Mangalashtak Once More.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X