twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను చూస్తూనే ఉన్నా.. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి: రేణు దేశాయ్

    |

    కరోనా మహమ్మారి దేశాన్ని గడగడలాడిస్తోంది. ఈ వైరస్‌కి సరైన మందు లేదు. పైగా ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి చాలా సులభంగా అంటుకునే గుణం ఉండటంతో ఇప్పటికే వెలది మంది ఈ వైరస్ బారిన పడ్డారు. కాబట్టి సామాజిక దూరం పాటించడం ఒక్కటే సరైన మార్గమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. అయితే ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో కొందరు మాత్రం యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. తాజాగా ఈ ఇష్యూపై స్పందించింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీ నటి రేణు దేశాయ్.

    Recommended Video

    Renu Desai Sensational Reaction On Disha Case
    భారత దేశంలో కరోనా విజృంభణ.. విశ్లేషకుల మాట

    భారత దేశంలో కరోనా విజృంభణ.. విశ్లేషకుల మాట

    కరోనా దెబ్బకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతమవుతున్నాయి. ప్రజా జీవనం స్తంభించిపోయింది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 200 పైగా దేశాలను వణికిస్తోంది. భారత దేశంలో ఇప్పటికే 3000 పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం దేశ ప్రజలను గడగడలాడిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ విధిగా పాటించడం ఒక్కటే మార్గమని విశ్లేషకులు చెబుతున్నారు.

    ఇది చాలా ప్రమాదం.. మీడియా ముందు రేణు దేశాయ్

    ఇది చాలా ప్రమాదం.. మీడియా ముందు రేణు దేశాయ్

    కరోనా మహమ్మారి నుంచి బయటపడటానికి సామాజిక దూరం పాటించడం కన్నా వేరే మందు లేదని ఓ వైపు ప్రభుత్వాలు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సూచిస్తున్నా.. కొందరు మాత్రం అవేవీ పట్టవన్నట్లుగా రోడ్లపైకి వస్తున్నారు. అయితే ఇది చాలా ప్రమాదం అంటూ ఓ ప్రముఖ మీడియా ముందు వెల్లడించింది రేణు దేశాయ్.

    ఇంకా కొన్ని రోజులే.. ఓపిక పట్టండి

    ఇంకా కొన్ని రోజులే.. ఓపిక పట్టండి

    ప్రపంచమంతా ఈ విపత్కర పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే దయచేసి ఇంట్లోనే ఉండండి. ఇంకా కొన్ని రోజులే. 10 రోజులు మాత్రమే. కొంచెం ఓపిక పట్టండి.. ఇంట్లోనే కూర్చోండి. నేను నా బాల్కనీ నుంచి చూస్తున్నా. చాలా మంది బయట తిరుగుతున్నారు. దయచేసి బయటికి వెళ్లొద్దు అని చెప్పింది రేణు దేశాయ్.

    నాకు తెలుసు అది ఎంత కష్టమో..

    నాకు తెలుసు అది ఎంత కష్టమో..

    ఈ లాక్‌డౌన్ అనేది మన రక్షణ కోసం, మన కుటుంబ రక్షణ కోసమే. దయచేసి ఇంట్లోనే ఉండండి. నాకు తెలుసు ఇంట్లో కూర్చోవడం ఎంత కష్టమో. పనులు మానుకుని ఇంట్లో కూర్చుని ఉండటం అంత ఈజీ కాదు. కానీ ఇది ఆరోగ్యం కోసమే అందరూ భావించండి అంటూ అందరినీ రిక్వెస్ట్ చేసింది రేణు.

     అలా రిలాక్స్ అవండి..

    అలా రిలాక్స్ అవండి..

    మీరు బయటకు వెళ్లారంటే ఎవరికి కరోనా వైరస్ ఉందో, ఎవరికి లేదో తెలియదు. ఒకవేళ వైరస్ సోకిన వ్యక్తితో మీరు ఇంటరాక్ట్ కావడం వల్ల మీకు కూడా ఆ వైరస్ అంటుకుంటుంది. అలా మీ ద్వారా మీ కుటుంబ సబ్యులకు వ్యాప్తి చెందుతుంది. ఇది చాలా ప్రమాదకరం. మీ కోసం, మీ ఫ్యామిలీ కోసం ఇంట్లోనే రిలాక్స్ అవండి అని చెప్పింది రేణు దేశాయ్.

    English summary
    In India Corona effected people increased day by day. On this situation Renu Desai says importence of lackdown.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X