Pawan Kalyan అందుకే నిన్ను తన్ని తరిమేశాడు.. రేణు దేశాయ్ ఏమందంటే?
రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి పరిచయం అక్కర్లేదు. బద్రి సినిమాలో బంగాళ ఖాతంలో నీరంటే నువ్వేలే అనే సాంగ్ ఎంత పాపులరో.. అంతకుమించి ఫేమస్ అయ్యారు రేణు దేశాయ్. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాందించుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ మాజీ భార్యగా ఆమెను నిత్యం కొంతమంది నెటిజన్లు టార్గెట్ చేస్తూ మాటలు కూడా అంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ నెటిజన్ ఆమెపై ఘాటుగా కామెంట్ చేయగా రేణు దేశాయ్ ఇచ్చిన రిప్లై ప్రస్తుతం వైరల్ అవుతోంది.
2012లో డివోర్స్:తెలుగులో బద్రి సినిమాతో హీరోయిన్గా మోస్ట్ పాపులారిటీ సంపాందించుకున్నారు రేణు దేశాయ్. ఇందులో పవన్ కల్యాణ్ సరసన నటించగా, వాళ్లిద్దరి జంటకు మంచి క్రేజ్ వచ్చింది. అయితే పవన్ కల్యాణ్‌ను పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చారు. అతని పేరే అకీరా నందన్.

మళ్లీ బ్రేక్:ఇక పవన్ కల్యాణ్ తో పెళ్లి తర్వాత రేణు దేశాయికి ఆద్య అనే అమ్మాయి జన్మించింది. పలు కారణాలతో ఇద్దరూ డివోర్స్ తీసుకోగా.. రేణు దేశాయ్ పిల్లలతో గడుపుతున్నారు. హీరోయిన్ గా విరామం తీసుకున్న ఆమె ఆ మధ్య దర్శకురాలిగా మారి ఓ సినిమాను డైరెక్ట్ చేశారు. దర్శకురాలిగా, బుల్లితెరపై జడ్జిగా రీ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. తర్వాత కొంత కాలం మళ్లీ బ్రేక్ తీసుకున్నారు.

రవితేజ మూవీతో:త్వరలో రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు రేణు దేశాయి. ఇదిలా ఉంటే ఓ జంట విడిపోతే ఎక్కువగా అమ్మాయిపైనే నెగెటివ్ కామెంట్స్ వస్తుంటాయి. అలా విడాకుల నుంచి ఇప్పటివరకు రేణు దేశాయి తీవ్రమైన నెగెటివిటీని ఎదుర్కొంటున్నారు. నెటిజన్లు, పవన్ కల్యాణ్ హేటర్స్, అభిమానులు అనే మాటలకు నిత్యం సమాధానాలు, కౌంటర్స్ ఇస్తూనే ఉంటున్నారు.

తన్ని తరిమేశాడు:తాజాగా రేణు దేశాయ్ సోషల్ మీడియోలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ సమాజానికి కావాల్సిన వ్యక్తి, తనకు ఓటు వేయండి అంటూ పవన్ కు సపోర్ట్ గా మాట్లాడారు. దీనికి పవన్ హేటర్స్ ఆమెపై ఫైర్ అయినట్లుగా తెలుస్తోంది. ఓ నెటిజన్ మాత్రం "అందుకే పవన్ కల్యాణ్ నిన్ను తన్ని తరిమేశాడు" అని ఘోరంగా కామెంట్ చేశాడు. దీనిపై రేణు దేశాయ్ ఘాటుగానే స్పందించారు.

ఇదే అర్థం:నెటిజన్ కామెంట్ ను "స్క్రీన్ షాట్ తీసి షేర్ చేస్తూ నన్ను తిట్టడంతో నీకు మనశ్శాంతి లభించిందా. లేదంటే ఇంకా చెప్పండి. నా మాజీ భర్తను ఫాలో అయ్యేవారు, లేదా ఆయనకు వ్యతిరేకంగా ఉండేవాళ్ల దగ్గర నుంచి తిట్లు వినడం మాత్రమే నా జీవితానికి అర్థం అనిపిస్తుంది. కానివ్వండి" అని చెప్పుకొచ్చారు రేణు దేశాయి. అలాగే ఆ పోస్టుకు ఓ నోట్ కూడా రాసుకొచ్చారు.
డబ్బు తీసుకుని:"నేను విడాకుల గురించి.. నా మాజీ భర్త చేతిలో ఎలా మోసపోయాను అన్న విషయం మాట్లాడినప్పుడు తన ఫ్యాన్స్ అంతా నన్ను వేధించారు. ఇప్పుడు ఒక పౌరురాలిగా ఆయనకు సపోర్ట్ గా నిజం మాట్లాడితే ఆయన హేటర్స్ వేధిస్తున్నారు. ఒకప్పుడు విడాకుల గురించి మాట్లాడేందుకు డబ్బులు తీసుకున్నానని అన్నారు. ఇప్పుడు కూడా అదే డబ్బు తీసుకునే మాట్లాడుతున్నానని అంటున్నారు" అని రేణు తెలిపారు.
ఇదే నా తలరాత:"నేను రెండు సందర్భాల్లో నిజం తప్పా ఇంకేం మాట్లాడలేదు. ప్రేమలో పడినందుకు. నిజాలు మాట్లాడినందుకు ఇదంతా అనుభవించక తప్పదేమో. ఒకవేళ ఇదే నా తలరాత ఏమో. ఇంకా వేధింపులు మొదలు పెట్టండి" అని రేణు దేశాయి ఎమోషనల్ గా రాసుకొచ్చారు.


Click it and Unblock the Notifications











