మ్యారేజ్, అకిరా గురించి అడగొద్దు.. చాలా కాలం తరువాత అభిమానులతో రేణు దేశాయ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడిపోయిన తరువాత రేణు దేశాయ్ పూణేలో తన పిల్లలతో జీవిస్తోంది. రేణు దేశాయ్ తరచుగా సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటుంది సంగతి తెలిసిందే. అకిరా, ఆద్య గురించి తెలుసుకోవడానికి పవన్ అభిమానులు చాలా ఆసక్తి చూపుతుంటారు. ఆ మధ్యన రేణు దేశాయ్ రెండవ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నపుడు సోషల్ మీడియాలో కొంత వ్యతిరేకత ఎదురైంది. సోషల్ మీడియా నుంచి వస్తున్న విమర్శల రేణు దేశాయ్ కూడా ధీటుగా ఎదుర్కొన్నారు. చాలా రోజుల తరువాత ఆమె ఆన్లైన్ లోకి వచ్చి అభిమానులతో ముచ్చటించారు.

రెండో పెళ్ళికి సిద్ధం
కొన్ని నెలల క్రితమే రేణు దేశాయ్ రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఓ వ్యక్తితో రేణు దేశాయ్ నిశ్చితార్థం కూడా జరిగింది. ఆ వ్యక్తి ఎవరనే విషయాలు రేణు దేశాయ్ ఇంతవరకు బయట పెట్టలేదు. వివాహం జరిగాక వెల్లడిస్తానని తెలిపింది. ఇదిలా ఉండగా రేణు దేశాయ్ చాలా కాలం తరువాత సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి అభిమానులతో పలు విషయాలు ముచ్చటించారు.

రచయితగా
రేణు దేశాయ్ ఇటీవల రచయితగా మారి కొన్ని రచనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడూ ఆమె సోషల్ మీడియాలో కవితలు కూడా పోస్ట్ చేస్తున్నారు. తాను రచించిన ఓ పుస్తకం డిసెంబర్ లో విడుదల కాబోతోందని, ఆ బుక్ వివరాలు తెలియజేసేందుకు తాను లైవ్ లోకి వచ్చానని రేణు దేశాయ్ అన్నారు. తాను రచించిన పుస్తకాన్ని అనంత శ్రీరామ్ తెలుగులో అనువదించారని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

మ్యారేజ్, అకిరా గురించి అడగొద్దు
రేణు దేశాయ్ లైవ్ లోకి రాగానే చాలా మంది అభిమానులు ఉత్సాహం ప్రదర్శించారు. అకిరా ఎక్కడ అంటూ ప్రశ్నించారు. అభిమానుల అత్యుత్సాహాన్ని రేణు దేశాయ్ కూల్ గా సమాధానం ఇచ్చారు. దయచేసి అకిరా గురించి, పెళ్లి గురించి ఇప్పుడు అడగొద్దు. అకిరా, ఆద్య గురించి నేను తరువాత చెబుతా అంటూ ఫ్యాన్స్ ని శాంతపరిచారు.

నెటిజన్లకు క్లాస్
పలు సందర్భాల్లో రేణు దేశాయ్ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సారి ఆమె వారి గురించి కాస్త ప్రశాంతంగా మాట్లాడారు. చాలా మంది సోషల్ మీడియాలో హీరోలు, హీరోయిన్ల పేర్లతో కనిపిస్తారు. మీ తల్లిందండ్రులు పెట్టిన పేరుని ఎందుకు దాచేస్తారు అంటూ రేణు దేశాయ్ సున్నితంగా క్లాస్ పీకారు. మనకంటూ సొంత గుర్తింపు ఉండాలి అని రేణు తెలిపారు.


Click it and Unblock the Notifications











