twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ముఖంలో బాధ అందుకే, కానీ కాదనలేకపోయా: రేణు దేశాయ్

    |

    ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చర్చనీయాంశం అయింది.

    ప్రస్తుతం చాలా చోట్ల డెంగీ, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమలకు సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా ఉండదు... అందరిపైనా తమ ప్రతాపం చూపిస్తుంటాయి. ఇటీవల సాహో డైరెక్టర్ సుజీత్ కూడా డెంగీ బారిన పడ్డ సంగతి తెలిసిందే. రేణు దేశాయ్ కుడా ఇపుడు ఈ బాధితుల లిస్టులో చేరిపోయారు.

    డెంగీ బారిన పడిన రేణు దేశాయ్

    డెంగీ బారిన పడిన రేణు దేశాయ్

    రేణు దేశాయ్ డెంగీ బారిన పడ్డారు. కొన్ని రోజులుగా దీనికి చికిత్స తీసుకుంటున్న ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా వెల్లడించారు. అయితే ఇంకా పూర్తిగా కోలుకోకుండానే ఓ టీవీ షోలో పాల్గొనాల్సి వచ్చిందట.

    నా ముఖంలో బాధ ఉంది, కానీ కాదనలేక పోయా

    ‘‘నా ముఖం చూశారుగా... అందులో బాధ కనిపించడానికి కారణం డెంగీ. కొన్ని రోజులుగా చికిత్స తీసుకుంటున్నాను. కోలుకుంటున్న సమయంలో ఢీ చాంపియన్స్ రియాలిటీ షోలో పాల్గొనాల్సి వచ్చింది. కొన్ని గంటలే షూటింగ్ కావడంతో కదనలేక పోయాను.'' అని రేణు దేశాయ్ ఓ సెల్ఫీ పిక్ పోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

    దోమల విషయంలో జాగ్రత్త

    దోమల విషయంలో జాగ్రత్త

    ‘‘దోమలతో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. దోమల నుంచి కాపాడుకోవడానికి క్రీములు రాసుకోవడంతో పాటు, ఒళ్లంతా కప్పి ఉంచే దుస్తులు ధరించండి. దోమకాటుకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి'' అని రేణు దేశాయ్ పేర్కొన్నారు.

    హైదరాబాద్ షిప్ట్ అవుతున్న రేణు దేశాయ్

    హైదరాబాద్ షిప్ట్ అవుతున్న రేణు దేశాయ్

    2017లో స్టార్ మా టీవీలో 'నీతోనే డాన్స్' అనే కార్యక్రమానికి జడ్జిగా చేసినప్పటి నుంచి తెలుగులో రేణు దేశాయ్‌కు చాలా ఆఫర్లు వస్తూనే ఉన్నాయని, దీంతో పాటు రైతుల గురించి టాలీవుడ్లో ఓ సినిమా చేసే ఆలోచనలో ఆమె ఉన్నారు. అందుకే హైదరాబాద్ షిప్ట్ అవ్వాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    English summary
    "And this is how dukhi I look when I have to shoot while recovering from dengue. But just couldn’t say no to few hours of shoot of Dhee champions on Etv. Guys be very careful with mosquitoes. Keep your surroundings clean and use mosquito repellent creams. Try to wear long sleeves and long pants! Take care." Renu desai said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X