అకిరా అప్సెట్ అయ్యాడా.. పెళ్లి ఎందుకు అని రేణుని ప్రశ్నించిన స్నేహితులు, తొలిసారి స్పందన!

పవన్ కళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయి చాలా కాలం అవుతోంది. రెండవ వివాహంతో త్వరలో రేణు మళ్ళీ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతోంది. ఇటీవలే కాబోయే భర్తతో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కానీ రేణు దేశాయ్ ఇప్పటికి తనకు కాబోయే భర్త వివరాలు గోప్యంగానే ఉంచడం విశేషం. ఈ కార్యక్రమంలో రేణుదేశాయ్ పిల్లలు అకిరా, ఆధ్య కూడా పాల్గొన్నారు. ఎట్టకేలకు రేణు దేశాయ్ తన రెండవ వివాహం గురించి ఓ జాతీయ పత్రికతో స్పందించారు.

Recommended Video

Renu Desai Engagement Pics Goes Viral
 అరేంజ్డ్ మ్యారేజే

అరేంజ్డ్ మ్యారేజే

తాను చేసుకోబోతున్నది పెద్దలు కుదిర్చిన వివాహమే అని రేణు దేశాయ్ తెలిపింది. దీనిపట్ల తాను సంతోషంగా ఉన్నపటికీ జీవితంలో ప్రేమ అనేది ఒక్కసారి మాత్రమే జరుగుతుందని రేణుదేశాయ్ తెలిపింది.

మంచి వారు

మంచి వారు

తాను చేసుకోబోతున్న వ్యక్తి చాలా మంచివారని రేణు దేశాయ్ తెలిపింది. ఇప్పుడు చేసుకోబోతున్న వివాహం ప్రశాంతంగా గడపడం కోసమే అని రేణు దేశాయ్ తెలిపింది. గత ఏడేళ్లుగా తాను సింగిల్ గా ఉంటున్నాని రేణు తెలిపింది.

స్నేహితులు ప్రశ్నించారు

స్నేహితులు ప్రశ్నించారు

వివాహ తేదీ, వేదిక ఇంకా ఖరారు కాలేదని రేణు తెలిపింది. కొంతంది తనకు ఇచ్చిన సలహాతో తాను విభేదించానని రేణు తెలిపింది. ఈ సమయంలో వివాహం ఎందుకు అని కూడా తన అని స్నేహితులు ప్రశ్నించారని రేణు తెలిపింది.

స్నేహితుల సలహాకు రేణు నో

స్నేహితుల సలహాకు రేణు నో


రేణుకు కాబోయే భర్త బాగా సంపాదిస్తున్నారు. రెండు కూడా సంపాదిస్తోంది. ఇద్దరూ సహజీవనం ఎందుకు చేయకూడదు అని తన సన్నిహితులు సలహా ఇచ్చారని రేణు తెలిపింది. కానీ తనకు మ్యారేజ్ పైనే నమ్మకం అని తెలిపింది.

ఛాయిస్ లేదు

ఛాయిస్ లేదు

గతంలో తాను సహజీవనం చేసానని రేణుదేశాయ్ తెలిపింది. కానీ ఆ సమయంలో నాకు ఛాయిస్ లేదు. మరోమారు సహజీవనం చేయాలనీ తాను భావించడం లేదు. 37 ఎల్లా వయసున్న తనకు సాంప్రదాయాలపై నమ్మకం ఉందని తెలిపింది.

సోషల్ మీడియాలో టార్చర్

సోషల్ మీడియాలో టార్చర్

సోషల్ మీడియాలోకి లాగిన్ అవ్వాలంటే టార్చర్ గా ఉందని రేణు తెలిపింది. కొంతమంది పెడుతున్న మెస్సేజ్ లు చూసి తన పీఆర్ షాక్ కి గురవుతున్నారని రేణు తెలిపింది. ఎంత ట్రోలింగ్ చేసిన తానూ వెనకడుగు వేయనని రేణు తెలిపింది. వారి మైండ్ సెట్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తానని తెలిపింది. తానేమి క్రైం చేయడం లేదని పెళ్లి చేసుకుంటున్నాను అంతే అని రేణు తెలిపింది.

అభినందనలు తెలియజేసేవారు కూడా

అభినందనలు తెలియజేసేవారు కూడా


ట్రోలింగ్ తో పాటు తనకు అభినందనలు తెలియజేసే మెసేజ్ లు కూడా వస్తున్నట్లు రేణు తెలిపింది. రెండవ వివాహం చేసుకోబోతున్న రేణు దేశాయ్ కి పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

 అకిరా అప్సెట్

అకిరా అప్సెట్

తన రెండవ వివాహంతో అకిరా నందన్ అప్సెట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై రేణు దేశాయ్ సరదాగా స్పందించింది. అలా చిన్నతనంతో తన కొడుకు ఆలోచించడు అని రేణు తెలిపింది. కానీ విందు మెనూలో పన్నీర్ బటర్ మసాలా లేకపోవడంతో అప్సెట్ అయ్యాడని సరదాగా వ్యాఖ్యానించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X