పవన్ మీద మహేష్ కత్తి కామెంట్..... రియాక్ట్ అయిన రేణు దేశాయ్!
మహేష్ కత్తి ఇష్యూపై రేణు దేశాయ్ స్పందించారు. తనకు అతడు ఎవరో తెలియదని రేణు అన్నారు.
Recommended Video

బిగ్‌బాస్ కంటెస్టెంట్, క్రిటిక్ మహేష్ కత్తి, పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య వివాదం ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమాల మీద, ఆయన రాజకీయ జీవితం మీద మహేష్ కత్తి విమర్శలు చేయడంతో.... పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందించారు. మహేష్ కత్తి మీద సోషల్ మీడియా ద్వారా విరుచుకుపడటం, ఫోన్లు చేసి బెదిరించడం లాంటివి చేశారు.
మహేష్ కత్తి వివాదంపై పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా స్పందించారు. ముంబైలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే పవన్ కళ్యాణ్ మీద కొందరు ఇలాంటి చీప్ కామెంట్లు చేస్తున్నారని, అసలు తనకు కత్తి మహేష్ ఎవరో కూడా తెలియదని అన్నారు.

ఆయన గురించి తెలిస్తే అలా అనరు
వపన్ కళ్యాణ్ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వారు ఎవరూ ఇలాంటి విమర్శలు చేయరని, మహేష్ కత్తి లాంటివారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని రేణు దేశాయ్ అన్నట్లు సమాచారం.

మళ్లీ విరుచుకుపడ్డ మహేష్ కత్తి
కాగా.. పవన్ కళ్యాణ్ మీద మహేష్ కత్తి ట్విట్టర్లో మరోసారి విరుచుకుపడ్డారు. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యపై పవన్ ట్వీట్ చేయగా... పవన్ కళ్యాణ్ ట్వీట్లోని తప్పులను మహేష్ కత్తి ఎత్తి చూపుతూ విమర్శలు చేశారు.

ఆమె పేరు అది కాదు
పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్ అని పేర్కొన్నారు. దీన్ని గుర్తించిన మహేష్ కత్తి... హత్యకు గురైన జర్నలిస్ట్ పేరు గౌరీ శంకర్ కాదు గౌరీ లంకేశ్ అంటూ పవన్ తప్పును ఎత్తి చూపారు.
పవన్ అజ్ఞాని
మోదీ, హిందుత్వ విధానాలకు మద్దతు తెలిపిన పవన్ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడని, ఈ హత్య కేసులో నిజానిజాలు తేలేవరకు మాట్లాడను అంటున్నాడు, పవన్ కులాలకు, మతాలకు అతీతమైన వ్యక్తని.... అలాగే జ్ఞానం లేని వ్యక్తని తనకు ఇప్పుడు అర్థమైందని మహేష్ కత్తి విమర్శించారు.


Click it and Unblock the Notifications











