»   » తెలుగు పరిశ్రమకు మళ్లీ రేణు దేశాయ్...డిటేల్స్

తెలుగు పరిశ్రమకు మళ్లీ రేణు దేశాయ్...డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయి ఇప్పుడు మరాఠీలో విజయవంతమైన నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆమె చాలా గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే నటిగా కాదు. ఓ నిర్మాతగా ఆమె తన చిత్రాన్ని డబ్బింగ్ చేసి విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. Ishq Wala Love టైటిల్ తో ఆమె ఓ చిత్రాన్ని మరాఠీలో డైరక్ట్ చేసారు. ఆ చిత్రం అక్కడ విజయవంతం అయ్యింది. ఈ చిత్రంలో రెండు పాటలను ఖుషీ దర్శకుడు ఎస్.జె సూర్య స్వరపరిచారు. ఇక ఈ డబ్బింగ్ విషయాన్ని ఆమె స్వయంగా ఖరారు చేసారు.

రేణు దేశాయ్ మాట్లాడుతూ..."అవును ఈ రోజే డెషిషన్ తీసుకున్నాను. ఇష్క్ వాలే లవ్ ని డబ్బింగ్ చేస్తున్నాను. డైలాగులు, లిరిక్స్ క్వాలిటీ కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా, తెలుగు ఫ్యాన్స్ ఎడ్జెస్ట్ చేసుకుంటారుని ఆశిస్తున్నా ." అని చెప్పారామె. అన్నీ అనుకూలిస్తే ఈ చిత్రం సెప్టెంబర్ 26 న విడుదల అయ్యే అవకాసం ఉంది.

Renu Desai Returns to Tollywood


పెళ్లి చేసుకోకుండానే ఎంతో సంతోషంగా సహ జీవనం సాగిస్తున్న పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు. నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు.

రేణు దేశాయ్ నిర్మాతగా మారి 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే మరాఠీ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈచిత్రం విడుదలైంది. సమీర్ జోషి దర్శకత్వంలో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈచిత్రంలో స్వప్నిల్ జోషి, ముక్తా బార్వే, సాయి తమ్హాంకర్ ముఖ్య పాత్రలు పోషించారు.

English summary
Actress-turned-filmmaker Renu Desai is planning to release Ishq Wala Love film in Telugu as well. Renu wrote on her Facebook page, "Yes,decision taken today.Dubbing Ishqwalalove in Telugu. Dialogue & Lyric quality might suffer little, but hoping my Telugu fans adjust for it."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu