పవన్ కళ్యాణ్ గురించిన విషయాలు అడగొద్దు: రేణుదేశాయ్
హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ మరాఠీలో ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. తన కూతురు పేరు మీద 'శ్రీ ఆద్య ఫిలింస్', కొడుకు పేరు మీద ‘అకీరా ఫిల్మ్స్' అనే సినీ నిర్మాణ సంస్థలను స్థాపించింది. ఇప్పటికే 'మంగలాష్ తక్ వన్స్ మోర్' అనే చిత్రాన్ని నిర్మించి విజయం సొంతం చేసుకున్నారు.
రేణు దేశాయ్ తాజాగా ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 'ఇష్క్ వాలా లవ్' అనే మరాఠీ చిత్రం చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో అక్టోబర్ 17న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రోజు ఆమె హైదరాబాద్‌లో మీడియా సమావేశం ప్లాన్ చేసారు.
రేణు దేశాయ్ కనిపిస్తే....మీడియా వారు ముందుగా అడిగేది పవన్ కళ్యాణ్ గురించి, అతని నుండి ఎందుకు విడిపోయారనే విషయాల గురించే. ఈ విషయాలను ముందే పసిగట్టిన ఆమె ఈ రోజు జరిగే ‘ఇష్క్ వాలా లవ్' చిత్రం ప్రెస్ మీట్లో అలాంటి ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు.

'సినిమా గురించి మాత్రమే అడగాలి'....అంతకు మించిన ఏమీ అడగొద్దు, వ్యక్తిగత విషయాలు, పవన్ కళ్యాణ్ గురించిన విషయాల ప్రస్తావన తేవొద్దు అని ముందుగానే తన పిఆర్ఓ ద్వారా మీడియా ప్రతినిధులకు సందేశం పంపారు. మరి రేణు దేశాయ్ మాట మీడియా వారు వింటారా? ఏం జరుగబోతోంది? అనేది ఈ రోజు సాయంత్రం తేలనుంది.
సినిమా గురించిన విషయాల్లోకి వెళితే...
ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. అక్టోబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం. అకీరా నందన్ నటిస్తున్న తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నారు.


Click it and Unblock the Notifications











