రేణు దేశాయ్ సంచలనం.. రెండో పెళ్లి ఏర్పాట్లు.. వరుడితో ఫోటో షూట్

Recommended Video

Renu Desai Posts About Her Fiance || Filmibeat Telugu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రెండో పెళ్లికి సిద్దమయ్యింది. గత కొంతకాలంగా రేణు దేశాయ్ రెండో పెళ్లిపై ఓ రేంజ్ లో చర్చలు జరుగుతున్నాయి. పవన్ భార్యగా పిలిపించుకోవడం తనకు ఇష్టం లేదని, తాను రెండో పెళ్లికి సిద్దమయ్యానని రేణు స్వయంగా ప్రకటించింది. ఇది జరిగి ఏడాది గడిచి పోవడంతో ఇక రేణుదేశాయ్ పెళ్లి చేసుకోదు అని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది రేణు దేశాయ్.

ఏడాది క్రిందటే నిశ్చితార్థం

ఏడాది క్రిందటే నిశ్చితార్థం

పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ బాగా పాపులర్ పర్సన్. అయితే పవన్ తో విడాకుల అనంతరం మీడియాలో కనిపించని రేణు.. గత సంవత్సరం కాలంగా ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సైతం అప్‌డేట్ గా ఉంటూ తనకు సంబందించిన వ్యక్తిగత విషయాలను సైతం పోస్ట్ చేస్తోంది. ఈ మేరకు గతేడాది ఓ వ్యక్తికి రింగ్ తొడుగుతున్న పిక్ షేర్ చేసి షాకిచ్చింది.

 పవన్ లేడీ ఫ్యాన్స్‌ పట్ల అసహనం

పవన్ లేడీ ఫ్యాన్స్‌ పట్ల అసహనం

అయితే రేణు రెండో పెళ్లి విషయమై పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆమెను ట్రోల్ చేశారు. పవన్ కళ్యాణ్ లేడీ ఫ్యాన్స్ సైతం ఆమెపై విరుచుకుపడుతూ మెసేజీలు పెట్టారు. కానీ వాటిని తిప్పికొడుతూ రేణు దేశాయ్ 'నా స్థానంలో మీరే ఉంటే ఏం చేసేవారని' ప్రశ్నించింది. పవన్ లేడీ ఫ్యాన్స్‌ పట్ల అసహనం వ్యకతం చేసింది.

వరుడి ఫొటో బయటకు రాలేదు.. కాలం గడిచింది

వరుడి ఫొటో బయటకు రాలేదు.. కాలం గడిచింది

నిశ్చితార్థం ఫొటోలు పెట్టినప్పటికీ వరుడి పిక్స్ మాత్రం ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు రేణు దేశాయ్. దీంతో ఆమె రెండో వరుడు ఎవరనే విషయంలో క్లారిటీ రాలేదు. పైగా ఏడాది గడుస్తున్నా పెళ్లి ఊసే లేదు. దీంతో రేణు దేశాయ్ రెండో పెళ్లి క్యాన్సిల్ అయిందనే వార్తలు ఊపందుకున్నాయి. పెళ్లి ఆగిపోయింది కనుకనే ఆమె ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదని చెప్పుకున్నారు జనం.

ఈ లోగా సడెన్ షాక్..

ఈ లోగా సడెన్ షాక్..

జనాల్లో ఈ చర్చ ముదరడం గమనించిన రేణు దేశాయ్ మరోసారి క్లారిటీ ఇస్తూ ట్వీట్స్ పెట్టింది. సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసి.. అవి త‌న‌కు కాబోయే వాడు క్లిక్ చేసినవి అని పేర్కొంది. త‌న ఫియాన్సీకి థ్యాంక్స్ అని కూడా రేణుదేశాయ్ చెప్పడంతో సడెన్ గా షాకై పోయారంతా. ఈ కోణంలో తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని, అందుకు సంబందించిన పనులు జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చేసింది రేణు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X