రేణు దేశాయ్ ఏం చెబుతుంది? ఆసక్తిగా పవన్ ఫ్యాన్స్!(ప్రోమో)
హైదరాబాద్: తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత విషయాలను నేడు వెల్లడిస్తానని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ సతీమణి రేణుదేశాయ్ ప్రకటించినప్పటి నుంచి ఆయన అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తున్నానని, దాన్ని యూట్యూబ్ లో చూడవచ్చని నిన్న ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ ఇంటర్వ్యూ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు సాయంత్ర 5 గంటలకు ఆమె ఇంటర్వ్యూ వీడియో విడుదల కానుంది. ఫిల్మీబీట్ అందుకు సంబంధించిన వీడియో సాయంత్రం 5 గంటలకు మీ ముందుకు తేబోతంది. రెడీగా ఉండండి మరి.
రేణు దేశాయ్ తాజా సినిమా ఇష్క్ వాలా లవ్ విషయానికొస్తే...
ఇక రేణు దేశాయ్ తాజా సినిమా విషయానికొస్తే... ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ఇష్క్ వాలా లవ్' చిత్రాన్ని తెరకెంచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. అయితే సినిమా వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అకీరా నటించిన తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘ఇష్క్ వాలా లవ్' ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











