»   » పవన్ బ్యాడ్ ఫాదరా? రేణు దేశాయ్ ఫాదర్స్ డే ట్వీట్ దుమారం!

పవన్ బ్యాడ్ ఫాదరా? రేణు దేశాయ్ ఫాదర్స్ డే ట్వీట్ దుమారం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయింది. సాధారణంగా ఫాదర్స్ డే రోజు సెలబ్రిటీలంతా తమ తమ తండ్రులతో గడిపిన ఆనందకరమైన విషయాలను పాలు పంచుకుంటారు. కానీ రేణు దశాయ్ మాత్రం సరికొత్త వాదనకు తెరలేపారు.

Renu Desai's Thoughtful and Emotional Tweets On Father's Day

‘ప్రతి రోజు తల్లి&తండ్రి చేసే డ్యూటీ చేయడం ప్రతి రోజు ఒక పరీక్ష లాంటిది. పిల్లలకు ఇద్దరి ప్రేమ పంచాలి. ఒంటరిగా ఉంటున్న తల్లులందరికీ హ్యాపీ ఫాదర్స్ డే' అంటూ రేణు దేశాయ్ ట్వీట్ చేసారు. అయితే రేణు దేశాయ్ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మింగుడు పడటం లేదు.

రేణు దేశాయ్ చేసిన ట్వీట్ పవన్ కళ్యాణ్ ను బ్యాడ్ ఫాదర్ గా చిత్రీకరించే విధంగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా రేణు దేశాయ్ కి, పవన్ కళ్యాణ్ అభిమానులకు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయంలో వివాదం జరుగుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు మరొకటి మొదలైంది.

English summary
"It's an everyday test to perform the duties of a mom&dad.To give d child love of both parents.Wishing a #HappyFathersDay to all single moms", the actress turned director tweeted. Apparently, this did not go well with some section of Pawan Kalyan fans and they bashed the mother of two, saying she is portraying Pawan as a bad father.
Please Wait while comments are loading...