పిల్లలు రోడ్డుపై అడుక్కుంటుంటే బాధేసింది, పవన్ రాజకీయం నాకెందుకు: రేణు దేశాయ్
Recommended Video

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ 'ఎ లవ్, అన్ కండీషనల్' అనే కవితల పుస్తకం రాశారు. దీన్నితెలుగులో కూడా విడుదల చేశారు. బుక్ ప్రమోషన్స్‌లో భాగంగా రేణు దేశాయ్ పలు తెలుగు టీవీ ఛానల్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమెకు తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాల గురించి ప్రశ్న ఎదురవ్వగా తనదైన శైలిలో స్పందించారు. ఆమె ఎక్కువగా ఇలాంటి విషయాలను దాటవేయడానికి ప్రయత్నించారు. ఏం మాట్లాడితే ఎలాంటి అర్థాలు తీస్తారో? అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే ఒక ఆందోళన ఆమెలో కనిపించింది.

పిల్లలు రోడ్డుపై అడుక్కుంటుంటే...
కవిత్వం రాయడానికి మిమ్మల్ని ప్రభావితం చేసిన సంఘటనలు ఏమిటి? అనే ప్రశ్నకు రేణు దేశాయ్ స్పందిస్తూ... మనం రోడ్డు మీద వెళుతుంటే కొందరు పిల్లలు బెగ్ చేస్తూ కనిపిస్తారు. ఇలాంటివి చూసినపుడు చాలా బాధేస్తుంది. నన్ను బాగా ప్రభావితం చేసిన అంశాల్లో ఇదీ ఒకటి. దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండటానికి కారణం మన పొలిటికల్ సిస్టం బాగోలేక పోవడమే... అని రేణు దేశాయ్ తెలిపారు.

ఎన్టీవో పెట్టి సహాయం చేస్తాను
మన వ్యవస్థను మార్చడం అంత సులభం కాదు. అలా అని నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకోవడం లేదు. ఎప్పటికైనా నేను ఎన్టీవో మొదలు పెట్టి నా పూర్తి సమయం దానికే కేటాయించాలనుకుంటున్నాను. అప్పటి వరకు రైటింగ్, డైరెక్షన్లో కొనసాగుతాను అని రేణు దేశాయ్ తెలిపారు.

మంచి వారంతా ఇంట్లోనే ఉండిపోతున్నారు
మనం ఇంట్లో కూర్చుని ఇండియాలో బ్యాడ్ పొలిటికల్ సిస్టం ఉంది అని మాట్లాడుకుంటాం. మంచి వారు అంతా ఇలా మాట్లాడుకుని ఊరుకోవడం తప్ప వ్యవస్థను మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసే ధైర్యం చేయడం లేదు. ఎందుకంటే అదొక భిన్నమైన ప్రపంచం. అక్కడ స్టాండ్ అవ్వడం అంటే అంత సులభం కాదన్నారు.

పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా... ఏమో నాకు తెలియదు
పవన్ కళ్యాణ్ రాజకీయాలపై నేను కామెంట్ చేయాలనుకోవడం లేదు. ఆయనలో సమాజం కోసం ఏదైనా మంచి చేయాలనే తపన అయితే ఉంది. ఈ విషయం నేను గతంలో కూడా చెప్పాను. నేను ఎక్కువగా ఆంధ్ర పాలిటిక్స్ ఫాలో అవ్వడం లేదు. అందుకే నాకు ఇక్కడి విషయాలు తెలియవు. ఆయన్ను ముఖ్యమంత్రిగా చూసే అవకాశం ఉందా? అంటే నాకు తెలియదు. ఎందుకంటే నేను పూణెలో ఉంటున్నాను. ఇక్కడి రాజకీయాల గురించి నాకు అవగాహన లేదు.

అక్కడి వరకే ఆయన్ను గమనిస్తాను...
నేను కళ్యాణ్ గారి రాజకీయాల గురించి పట్టించుకోను. నా పిల్లల తండ్రిగా, ఆయన బాధ్యతల వరకే చూస్తాను. అంత వరకు మాత్రమే పట్టించుకుంటాను, మిగతా విషయాల గురించి పెద్దగా ఆలోచించను అని రేణు దేశాయ్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











