ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు? రేణు దేశాయ్ పెళ్లాడబోతోంది అతడినేనా?
Recommended Video

పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్ త్వరలో రెండో పెళ్లికి సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో విడిపోయిన ఆమె తన పిల్లలతో కలిసి కొన్నేళ్లుగా పూణెలో ఉంటున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితమే తన సోల్ మేట్‌ను వెతుక్కున్న రేణు దేశాయ్ ప్రస్తుతం అతడితో ప్రేమలో మునిగి తేలుతున్నారు. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు ఆమె తన సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులను బట్టి తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి ఎవరు? అనేది మాత్రం రేణు దేశాయ్ వెల్లడించలేదు.

రేణు దేశాయ్ తాజా పోస్ట్ హాట్ టాపిక్
తాజాగా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. స్విమ్ సూట్లో ఉన్న ఆమె తన చేతిలోని ఫోన్లో ఏదో మెసేజ్ చదువుతూ కనిపించారు. ఆ మెసేజ్ పంపింది ఎవరో కాదు ఆమె సోల్ మేటేనంట. అతడు పంపిన మెసేజ్ చదువుతూ ఉన్న తనను స్నేహితులు ఫొటోలు తీస్తూ ప్రైవసీకి భంగం కలిగించారని పేర్కొంది. దీన్ని బట్టి ఇద్దరి వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

చేతిలో చేయ్యేసి
ఇటీవల తన కాబోయే భర్త చేతిలో చేయ్యేసుకుని దిగిన ఫోటోను రేణు దేశాయ్ ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ‘నీతో ఉంటే చాలా సంతోషంగా, శాంతంగా ఉంటాను. నా చెయ్యి పట్టుకో.. ఎప్పటికీ విడువకు. అవును.. ఆ నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించావు' అని అని పేర్కొన్నారు.

ప్రస్తుతం గోవాలో...
ప్రస్తుతం రేణు దేశాయ్ తన పిల్లలు, స్నేహితులతో కలిసి గోవాలో గడుపుతున్నారు. గోవా వెకేషన్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు ఆమె అభిమానులతో షేర్ చేసుకున్నారు.

తల నొప్పిగా మారిన ఫ్యాన్స్
తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలోనే ఓసారి హింట్ ఇచ్చారు రేణు దేశాయ్. అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆమెను రెండో పెళ్లి చేసుకోవద్దంటూ ఒత్తిడి తేవడం ఆమెకు పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన మరో పెళ్లి చేసుకున్నారు... నేను చేసుకుంటే తప్పేంటి? అంటూ రేణు దేశాయ్ బహిరంగంగానే ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఏమైనా చేస్తారేమో అనే భయం?
తనను పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తికి ఏమైనా ప్రమాదం తలపెడతారేమో? అనే భయాన్ని కూడా ఆ మధ్య రేణు దేశాయ్ వ్యక్తం చేశారు. పరిస్థితి చక్కబడే వరకు అతడి గురించి బయటి ప్రపచానికి చెప్పకూడదనే ఉద్దేశ్యంతో రేణు దేశాయ్ ఉన్నారు. వీరి పెళ్లి మీడియాకు తెలియకుండా రహస్యంగా జరిగే అవకాశం ఉంది. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు రహస్యంగా పెళ్లి చేసుకుని తర్వాత ఫోటోస్ విడుదల చేస్తున్నారు. రేణు దేశాయ్ కూడా అలా చేసే అవకాశం లేక పోలేదు.


Click it and Unblock the Notifications











