ఆ పార్టీ ఎంపినే గెలిపించండి.. ప్యాకేజ్ తీసుకొని చెప్పడం లేదు.. రేణు దేశాయ్ సంచలన పోస్ట్

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వాతావరణం వాడివేడిగా ఉంది. రసవత్తరంగా సాగుతున్న ప్రచారంలో ఎవరి విజయంపై వారు ధీమాగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సినీ పరిశ్రమలో కొందరు తమకు నచ్చిన వ్యక్తికి, పార్టీకి అండగా ఉంటున్నారు. అయితే తాజాగా ఓ పార్టీకి పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సంచలన రీతిలో మద్దతు తెలియజేస్తూ పోస్టు పెట్టారు. ఆ పోస్టు వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్నది. అయితే అన్ని స్థానాల్లో అభ్యర్థుల మధ్య బలమైన పోటీ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో హైదరాబాద్‌ పార్లమెంట్ స్థానంలో పోటీ ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా మారింది. దాంతో అందరి చూపు ఈ స్థానంపై పడింది.

Renu Desai shared a post to Support Hyderabad s BJP Candidate of Madhavi Latha in Instagram

హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయంగా అత్యంత బలశాలి. ఎన్నో ఏళ్లుగా ఎంపీగా కొనసాగుతున్న ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టేందుకు బీజేపీ మరో స్టాంగ్ కంటెస్టెంట్‌ను బరిలోకి దించింది. మాధవీలత అనే అభ్యర్థిని పోటీలో నిలిపి ఈసారి ఎంఐఎంకు సవాల్ విసిరింది.

అయితే బీజేపీ పెట్టుకొన్న నమ్మకాన్ని రెట్టింపుగా మాధవీ లత పోటీలో దూసుకెళ్లినట్టు కనిపిస్తున్నది. ప్రచారంలో తనదైన హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ జాతీయ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన రీతిలో సమాధానాలు చెప్పి తనకంటూ ఓ ఇమేజ్‌ను సొంతం చేసుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.

Renu Desai shared a post to Support Hyderabad s BJP Candidate of Madhavi Latha in Instagram

ఇలాంటి ప్రత్యేకతలతో దూసుకెళ్తున్న మాధవీ లతకు రేణుదేశాయ్ సపోర్టుగా నిలిచారు. ఆమెకు అనుకూలంగా ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. చాలా రోజుల తర్వాత రాజకీయాల్లో బలమైన మహిళను చూశాను. ఆమెకు సపోర్టుగా నిలుస్తున్నట్టు పెడుతున్న ఈ పోస్టుకు నేను డబ్బులు తీసుకోలేదు. నేను నిజాయితీగా ఫీలయ్యాను.. కాబట్టి నా అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నాను అని రేణు దేశాయ్ అన్నారు.

మాధవీ లత వ్యక్తిగత వివరాల్లోకి వెళితే.. ఆమె అసలు పేరు కొంపెళ్ల మాధవీ లత. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. సామాజిక కార్యకర్తగా, బీజేపీ సిద్దాంతలను నమ్మిన కార్యకర్తగా మంచి పేరు ఉంది. హైదరాబాద్‌లోని పాపులర్ హాస్పిటల్ విరించికి చైర్ పర్సన్‌గా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X