రేణూ దేశాయ్‌ మళ్లీ కెలుకుతోంది.. పవన్ ఫోటోలపై నెటిజన్స్ ఫైర్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

రేణూ దేశాయ్ వ్యవహారం ఓ పట్టాన ఎవ్వరికీ అర్థం కాదు. ఆమె చేసే పోస్ట్‌లు ఎప్పుడూ వివాదాస్పదమే అవుతాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే రేణూ దేశాయ్..ఏదో ఒక పోస్ట్ చేసింది. నాటి స్మృతులను గుర్తు చేసుకుంటూనే లేదా ఆద్య, అకీరాలకు సంబంధించిన ఫోటోలనో షేర్ చేస్తూ ఉంటుంది. తన ప్రాజెక్ట్‌కు సంబంధించిన విషయాలను, విదేశాల్లో గడిపిన క్షణాలు ఇలా ఏదో ఒకటి నిత్యం షేర్ చేస్తూనే ఉంటుంది.

అయితే నిన్న (ఏప్రిల్ 20) షేర్ చేసిన ఫోటోలు చేసిన కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అయ్యాయి. దీనికి కారణం.. ఆమె షేర్ చేసింది పవన్ కళ్యాణ్‌తో గడిపిన క్షణాలు. తన మొదటి చిత్రం బద్రి ఇరవై యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కాస్త ఎమోషనల్ అయింది. ఈ మేరకు ఆమె నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది.వీటిపై నెటిజన్లు భిన్నరకాలుగా స్పందించారు. ఆమె కూడా వాటికి ఎంతో ఓర్పుతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.

బద్రికి ఇరవై యేళ్లు..

బద్రికి ఇరవై యేళ్లు..

పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలిచే చిత్రం బద్రి. ఈ సినిమాతో రేణూ దేశాయ్, పూరి జగన్నాద్‌ల జీవితం ముడిపడి ఉంది. దర్శకుడిగా పూరికి మొదటి సినిమా కాగా.. రేణూ దేశాయ్‌కీ మొదటి అవకాశమే. దీంతో వారిద్దరూ ఈ బద్రిని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో తెగ పోస్ట్‌లు చేశారు.

నాటి జ్ఞాపకాలను..

నాటి జ్ఞాపకాలను..

బద్రి సినిమా షూటింగ్, నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అప్పటి ఫోటోలను షేర్ చేసింది. పవన్, రేణు ఇద్దరూ ఏకాంతంగా కూర్చుని ఉన్నవి, ఏ చికితా, బంగాళాఖాతంలో పాటలకు సంబంధించిన స్టిల్స్‌ను పోస్ట్ చేసింది. అంతేకాకుండా అప్పుడు ఏం మాట్లాడున్నామో ఇంకా గుర్తుందంటూ అప్పటి కాలానికి వెళ్లిపోయింది. అయితే ఈ ఫోటోలు, పోస్ట్‌ల పట్ల కొందరు నెటిజన్స్ ఆశ్చర్యపోయారు.

 మళ్లీ కెలుకుతోంది..

మళ్లీ కెలుకుతోంది..

పవన్ కళ్యాణ్ ఫోటోలను షేర్ చేయడంపై స్పందించిన ఓ నెటిజన్.. ఈ రేణూ దేశాయ్ ఏంటో మళ్లీ కెలుకుతోంది.. అవసరమా ఇప్పుడు.. ఆ మధ్య చాలా ఓవర్ చేసింది.. మళ్లీ పోస్ట్‌లు ఎందుకు? ఎంగేజ్‌మెంట్ అయింది కదా ఆ విషయం ఏమైంది మళ్లీ.. ఎనీ న్యూస్ అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్‌ను తిరిగి పోస్ట్ చేస్తూ ప్రేమతో రేణు సమాధానమిచ్చింది.

Recommended Video

Pawan Kalyan Costly Gift To His Kids | Filmibeat Telugu
అంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు..

అంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు..

‘మీకు తెలియాలని చెబుతున్నాను ఇది అంటూ బద్రి సినిమాకు ఇరవై యేళ్లు. ఇది నా మొదటి సినిమా అని చాలా మంది మరిచిపోతారు.. కానీ ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం..అంత ద్వేషం ఎందుకు అన్నా? ఈ వైరస్ వల్ల అసలే ప్రపంచం మొత్తం క్రైసిస్‌లో ఉంది.. అందరి కోసం మంచిగా ఆలోచించండి.. ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాద'ని రేణూ దేశాయ్ ఎంతో ప్రేమగా సమాధానమిచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X