Akira Nandan: కొడుకు చేసిన పనికి భయపడిన రేణు దేశాయ్.. నిమిషాల్లో చేశాడంటూ పోస్ట్
రేణు దేశాయ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో తెలిసిన వ్యక్తి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్యగా, బద్రి మూవీ హీరోయిన్ గా ఆమె ఎంతో సుపరిచితం. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో యమ యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. పిల్లలకు సంబంధించిన ఫొటోలను నిత్యం షేర్ చేస్తూ మురిసిపోతుంటారు. అప్పుడప్పుడు నెటిజన్ల నుంచి నెగెటివ్ కామెంట్స్ తో ఇబ్బంది పడుతుంటారు. అయితే తాజాగా కొడుకు అకీరా నందన్ నిమిషాల్లో చేసిన పనికి తెగ సంబరపడిపోయిన రేణు దేశాయ్.. వెంటనే భయమేస్తుంది అని చెప్పుకొచ్చారు. అసలు ఏంటనే విషయంలోకి వెళితే..
సినిమా తర్వాత : పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన బద్రి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు రేణు దేశాయ్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ కెమిస్ట్రీకి మంచి హిట్ టాక్ వచ్చింది. దీంతో సినిమా భారీ హిట్ కొట్టింది. ఈ సినిమా తర్వాత పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ లివింగ్ రిలేషన్ షిప్ లోకి వెళ్లారు. అప్పుడు అకీరా నందన్ కు జన్మనిచ్చారు రేణు దేశాయ్.

అలా కెరీర్ : అకీరా నందన్ పుట్టిన తర్వాత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు పవన్-రేణు దేశాయ్. అనంతరం ఆద్య అనే పాపకు తల్లిదండ్రులు అయ్యారు. ఇక పలు కారణాల వల్ల 2012లో పవన్ కల్యాణ్-రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఇద్దర పిల్లల బాధ్యతలు తీసుకుంటూ నటిగా, దర్శకురాలిగా సినీ కెరీర్ సాగిస్తున్నారు.

ఏఐ ట్రెండింగ్ : టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంతో సినిమల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రేణు దేశాయ్ సోషల్ మీడియాలోను ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. తరచూ పిల్లలకు సంబంధించిన ఫొటోలు పెడుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆర్టిఫీషియన్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా ట్రెండింగ్ లోకి వచ్చింది. ఎవరూ చూడు ఈ ఏఐ గురించే డిస్కషన్స్ చేస్తున్నారు. అంతేకాకుండా పలు టీవీ ఛానెళ్లు ఏఐ యాంకర్లను కూడా ఇన్వెంట్ చేశాయి.
క్రియేటివ్ వర్క్ : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాముఖ్యత సంతరించుకున్న నేపథ్యంలో రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ ఓ క్రియేటివ్ వర్క్ చేశాడు. ఏఐ టెక్నాలజీలో రేణు దేశాయ్ ఫొటోలను రీ క్రియేట్ చేశాడు. ఆ ఫొటోల్లో రేణు దేశాయ్ వింటేజ్ లుక్ తో ఎంతో అంందంగా కనిపించారు. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.
చాలా భయంకరమైంది : అయితే ఈ ఫొటోలను షేర్ చేసిన రేణు దేశాయ్.. "ఈ అన్ని ఫొటోలను అకీరా కొన్ని నిమిషాల్లోనే జెనరేట్ చేశాడు" అని క్యాప్షన్ రాసుకొచ్చారు. అలాగే "ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిజంగా చాలా భయంకరమైంది" అని చెప్పుకొచ్చారు రేణు దేశాయ్.


Click it and Unblock the Notifications











